Friday, October 22, 2021
spot_img

కౌన్సిలింగ్‌ చేయించండి

ప్రశ్న:-”నాకు ఒక నెల రోజుల్లో పెళ్ళి ఉంది. మొన్ననే పెళ్ళి నిశ్చయమైంది. ఇదివరకు కొందరు అమ్మాయిలతో తిరిగాను. ఏ జబ్బు రాలేదు. కనీసం అంగం మీద చిన్న పుండుకూడా పడలేదు. అందుకని ఎయిడ్స్‌ గురించి గాని, మరొక దాని గురించి గాని నాకు ఆలోచన రాలేదు. పెళ్ళి నిశ్చయమైన తరువాత ఎందుకైనా మంచిదని ఎయిడ్స్‌ టెస్టు చేయించుకున్నాను. విచిత్రంగా ఆ టెస్టులో ఎయిడ్స్‌ ఉందని వచ్చింది. నా గుండె ఝల్లుమంది. లగ్నాలు కూడా పెట్టేసుకున్నారు. ఇప్పుడెలాగ? నాకు ఎయిడ్స్‌ ఉందని పెళ్ళి క్యాన్సిల్‌ చేసుకుంటే అందరూ చిన్నచూపు చూస్తారు. చెప్పకుండా చేసుకుంటే అమాయకురాలైన అమ్మాయి గొంతు కోసినట్టు అవుతుంది. అమ్మా-నాన్నలకి అయినా నాకు ఎయిడ్స్‌ ఉందని ఎలా చెప్పగలను? వాళ్ళకి నేను ఒక్కగానొక్క పిల్లవాడిని. నాకు ఎయిడ్స్‌ అని తెలిస్తే వాళ్ళు గుండెలు పగిలి చచ్చిపోతారు. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలా లేక వాళ్ళు చచ్చిపోవాలా లేక అమ్మాయి బతుకు నాశనం అయిపోవాలా? 

జవాబు:- ఎవరూ చనిపోనవసరం లేదు. ఎవరి బతుకూ నాశనం కానవసరం లేదు. మీరు ముందుగా మీ ఫ్యామిలీ డాక్టరుతో విషయమంతా చెప్పండి. ఆయన మీ పేరెంట్స్‌ని పిలిచి కౌన్సిలింగ్‌ చేసి అసలు విషయం చెబుతారు. మీ పేరెంట్స్‌ తాత్కాలికంగా కాస్త బాధపడినా, తగిన పరిష్కారం తెలుసుకుంటారు. ఏదో ఒక కారణం చెప్పి లగ్నాలని క్యాన్సిల్‌ చేసుకుంటారు లేదా మీకు ఎయిడ్స్‌ ఉన్న విషయాన్ని పెళ్ళికూతురు వాళ్ళకి చెప్పి, ఎల్లప్పటికి నిరోధ్‌ పెట్టుకుని సెక్సులో పాల్గొంటారని చెప్పి, అందుకు వాళ్ళు ఇష్టపడితే పెళ్ళి చేస్తారు. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీలాగే పెళ్ళికి ముందే సెక్సులో పాల్గొనే అబ్బాయిలూ ఉన్నారు, అమ్మాయిలూ ఉన్నారు. పెళ్ళి నిశ్చయానికి ముందే హెచ్‌.ఐ.వి. టెస్టు చేయించుకోవడం విజ్ఞతతో కూడిన పని. మీ విషయంలో అనాలోచితంగా పిచ్చి పనులు ఏమీ చేయకుండా వెంటనే డాక్టరుని కలిసి కౌన్సిలింగ్‌ పొందండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!