Tuesday, December 6, 2022
spot_img

ఆ స్పందనలు సహజమే కానీ

ప్రశ్న:-”నా వయస్సు 16 సంవత్సరాలు. టెన్త్‌ పరీక్షలు అయిపోయాయి. టెన్త్‌లో ఉండగా నా క్లాస్‌మేట్‌ ఒక అమ్మాయి నాతో చాలా క్లోజ్‌గా ఉండేది. పరీక్షలు అయిపోయిన తరువాత కూడా నన్ను తరచూ కలుసుకుంటోంది. నన్ను చూడకుండా ఉండలేకపోతున్నానని చెప్పింది. నాకూ ఆ అమ్మాయితో రోజూ మాట్లాడాలని ఉంటుంది. ఏ ఒక్కరోజూ ఆ అమ్మాయిని కలవకపోయినా మనసంతా అదోలాగా అయిపోతుంది. ఒకరోజు ఆ అమ్మాయి సడన్‌గా నన్ను ముద్దుపెటుకుంది. గట్టిగా కౌగిలించుకుంది. అలా అయిదు నిమిషాలు ఉంది. నాకూ చాలా హాయి అనిపించింది. అయిదు నిమిషాల తరువాత నన్ను వదిలేసి మూతి తుడుచుకుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి ముఖం ఎర్రగా కందిపోయి ఉబ్బిపోయినట్టు కనబడింది. కళ్ళు నిద్ర కళ్ళులాగా అనిపించాయి. తన ముఖం చూస్తే ఏమైనా జరిగిందా అని భయం వేసింది. అలా భయపడుతున్న సమయంలోనే నాకు ప్యాంటులో వీర్యం పడిపోయింది. నాకు ఎప్పుడూ అలా వీర్యం పడటం జరగలేదు. అదే మొదటిసారి. అంతకు ముందు అప్పుడప్పుడు హస్తప్రయోగం చేయడం, వీర్యం కారడం ఉంది గాని ఇలా జరగలేదు. ఆ అమ్మాయి ముఖం కందగడ్డలాగా తయారవడం, నాకు తెలియకుండా వీర్యం కారిపోవడం అర్థం కాని విషయాలుగా మారాయి. మా ఇద్దరికీ ఏమైనా ఆపద వస్తుందా? దయచేసి మమ్మల్ని ఆదుకోండి.” 

జవాబు:- యుక్త వయస్సు వచ్చిన తరువాత అబ్బాయి – అమ్మాయి ఒకరినొకరిని చూసుకుని ఆకర్షితులవడం సహజం. వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని చూడాలని తహతహలాడటం అతి సహజం. అలాంటి ఆలోచనలు కలగకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్టే. యుక్తవయస్సు వచ్చిన తరువాత వారిలో లైంగికపరంగా స్పందనలు కలగడానికి డోపమిన్‌, నార్‌ ఎపిసిఫ్రిన్‌ అనే కెమికల్స్‌ విడుదల అవుతాయి. రొమాన్స్‌కి సంబంధించిన ఈ కెమికల్స్‌ ఎక్కువ శాతంలో స్రవించి క్షణాల్లో శారీరక మార్పులని కలిగిస్తాయి. ముఖంలో, శరీరంలో, చర్మంలో రక్తనాళాలు బాగా వ్యాకోచిస్తాయి. నరాలు బాగా స్పందిస్తాయి. దాంతో ముఖం ఎర్రబడినట్టు, ఉబ్బినట్టు అవుతుంది. ముఖంలో నుంచి, చెవుల్లో నుంచి, తలలో నుంచి వేడివేడి ఆవిర్లు వచ్చినట్టు అనిపిస్తుంది. కళ్ళు కూడా మత్తుగా మూతబడతాయి. ఆ కళ్ళల్లో వచ్చిన మార్పు సెక్సువల్‌ ఎగ్జైట్‌మెంట్‌ని, ఉబికిన కామాన్ని ప్రస్ఫుటింపచేస్తాయి. ఇదంతా రొమాన్స్‌కి సంబంధించిన ‘లవ్‌ కెమిస్ట్రీ’ ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరిలోనూ ఈ లవ్‌ కెమిస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్‌ అవుతుంది. ఆ సమయంలో ఆడపిల్ల జననేంద్రియాల నుంచి ద్రవాలు అధికంగా స్రవించగా, మగపిల్లవానిలోని శుక్రకణాలు అధికంగా ముడుచుకుని వీర్యస్ఖలనం అయిపోతుంది. ఇదేమీ నరాల వీక్‌నెస్‌ కాదు, నష్టదాయకమైన పరిస్థితీ కాదు. మీ విషయంలో వీర్యస్ఖలనం అవడం అతి సహజమైన విషయం. అయితే ఈ వయస్సులో అటువంటి సెక్సువల్‌ ఫీలింగ్స్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తే చదువు అటకెక్కుతుంది. భవ్యమైన భవిష్యత్‌ దెబ్బతింటుంది. అందుకని సెక్సువల్‌ స్పందనలు సహజంగా కలిగేవే అయినప్పటికీ వాటిని కంట్రోల్‌ చేసుకోవాలి. లైంగిక స్పందనలు అదుపులో పెట్టుకోవడం కష్టమైన విషయం కాదు. మనస్సుకి కళ్ళెం వేయాలనుకుంటే తేలికగా వేయవచ్చు. మీరు ఇంకా పై చదువులు చదవాలి. పైకి రావాలి. అందుకని లైంగిక స్పందనలని అదుపులో ఉంచుకోండి. 

spot_img

Must Read

Previous articleThese Feelings Are Natural But
Next articleHow To Tell?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!