ప్రశ్న:- ”మాకు పెళ్ళై 12 సంవత్సరాలైంది. నిన్న మొన్నటి వరకు నేనూ, నా భార్య సెక్స్‌లో బాగా ఎంజాయ్ చేశాం. దాదాపు రోజూ సెక్స్‌లో పాల్గొనేవాళ్ళం. ఇటీవల కొంతకాలం నుంచి నాలో సెక్స్ వీక్నెస్ ఏర్పడింది. వారం పది రోజులకి ఒక్కసారి కూడా సెక్స్‌లో పాల్గొనలేకపోతున్నాను. మా ఆవిడకి రోజూ సెక్స్ కావాలి. నోటితో అడగదు కాని బెడ్ మీదకు చేరిన తరువాత మీద కాలువేయడం, నా మర్మావయవాల మీద చేయి వేయడం, లుంగీ తొలగించడం చేస్తుంది. అప్పుడు ఆమెను విసుక్కుని పక్కకి తిరిగి పడుకుంటున్నాను. ఏం చేయాలో తోచడం లేదు. సాయంత్రం అయితే నాకు భయం మొదలవుతుంది. ఆఫీసు నుంచి ఇంటికి రావాలంటే భయం వేస్తుంది. భార్యకి నా ముఖం ఎలా చూపించాలో తెలియడం లేదు. మా సంసారానికి మీరే దారి చూపాలి.”
జవాబు:- సాధారణంగా 30-40 సంవత్సరాల వయస్సులో వచ్చే సెక్స్ వీక్నెస్ స్ట్రెస్ వల్ల అవుతుంది. ఆఫీసు వర్కు వల్ల లేదా బిజినెస్ వ్యవహారాల వల్ల తెలియకుండా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడిలో శారీరక అలసట కూడా కలుగుతుంది. దాంపత్య జీవితం రొటీన్ అయిపోయాక సెక్స్ లైఫ్‌లో డల్‌నెస్ చోటు చేసుకుంటుంది. మానసిక ఒత్తిడిని తొలగించుకుని హుషారు పెంపొందించుకుంటే తిరిగి అంతా చక్కగా అవుతుంది. కాని చాలామంది ఇది అర్థం చేసుకోక అకస్మాత్తుగా తమలో సెక్స్ వీక్నెస్ ఏర్పడిందని భయపెడతారు. దిగులు చెందుతారు. పైగా వాళ్ళమీద వాళ్ళకి అపనమ్మకం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్లా, పనికి రాకుండా అయ్యామనే దిగులుతో సెక్స్ యాక్ట్‌లో పనికి రాకుండా అవుతారు. ఇది నిజమైన సెక్స్ వీక్నెస్ కాదు. మానసికంగా కలిగిన బలహీనత, అరుదుగా కొందరిలో షుగరు వ్యాధి చోటుచేసుకోవడం వల్లా, థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేయడం వల్లా, సెక్స్ హార్మోను తక్కువ ఉత్పత్తి అవడంవల్లా, ప్రొలాక్టన్ హార్మోను ఎక్కువ ఉత్పత్తి అవడం వల్లా సెక్స్ బలహీనత ఏర్పడుతుంది. మీరు డాక్టర్‌కి చూపించుకుని తగిన కౌన్సిలింగ్ పొందితే తిరిగి మామూలు అవుతారు. మీరు డాక్టరుని సంప్రదించండి. తప్పకుండా పూర్వంలా ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు.