ప్రశ్న:- ”నా యోగి రంధ్రం చిన్నదని ఎప్పటినుంచో అనుమానం ఉంది. 2-3 సార్లు యోనిలోకి వేలు పోనిచ్చి పరీక్ష చేసుకున్నాను. బాగా నొప్పి అనిపించింది. ఇటీవల ఓ అబ్బాయితో పరిచయం అయింది. అతను నన్ను పెళ్ళి చేసుకుంటానని అడుగుతున్నాడు. ఎలాగూ నన్ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు కనుక సెక్స్‌లో పాల్గొందామని అడిగాడు. నా యోగి రంధ్రం చిన్నదనే భయంవల్ల ముందు అందుకు ఒప్పుకోలేదు. కాని అతను మరింత ఫోర్సు చేయడంతో ఒప్పుకోక తప్పలేదు. నేను భయపడ్డంతా అయింది. అతను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అంగప్రవేశం జరగలేదు. నేను వైవాహిక జీవితానికి పనికిరానా? ఏదైనా ఆపరేషను చేస్తే నా యోగి విశాలంగా మారుతుందా? అతను సెక్స్‌కి ప్రయత్నించిన దగ్గర నుంచి నాలో చెప్పలేని అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. నా బ్రతుకు మీ చేతుల్లోనే ఉంది. పరిష్కారం చెప్పండి.”
జవాబు:- యోని రంధ్రం చిన్నదిగా ఉండటం, సెక్స్‌కి పనికి రాకపోవడం అంటూ ఉండదు. యోని ద్వారా దగ్గిర కండరాలు టైట్‌గా ఉండి మామూలుగా చిటికిన వేలు కూడా దూరనంతగా సన్నగా ఉంటుంది. కాని ఒకసారి యోని ద్వారం చేతి వేలితోగాని, అంగప్రవేశంతో గాని వెడల్పు అయితే అటుపైన సెక్స్‌లో పాల్గొనడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. యోని మార్గం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. అక్కడి కండరాలు ఎంత టైట్‌గా ఉంటాయో అంత తేలికగా కూడా విచ్చుకోవడాలు, ముడుచుకోవడాలు ఉంటాయి. ఇదే యోని కండరాలలోని ప్రత్యేకత. ఇది అర్ధం చేసుకుంటే యోని రంధ్రం చిన్నదని, అంగప్రవేశం కుదరదని అనుకోవడం తప్పని తేలుతుంది. కొందరు అమ్మాయిలలో ఉండే అర్థంలేని భయాలు, అనుమానాలు వల్ల ఉండి యోని దగ్గర వేలు పెట్టినప్పుడు గాని, అంగప్రవేశానికి ప్రయత్నించినప్పుడుగాని అక్కడి కండరాలు టైట్‌గా ముడుచుకుంటాయి. భయంవల్ల అలా టైట్‌గా మారడమే తప్ప యోనిరంధ్రం సాగడానికి వీలులేనట్టు ముడుచుకుపోయి ఉండటం కాదు. మీరు నిర్భయంగా పెళ్ళి చేసుకోండి. మొదటిసారి దాంపత్యంలో పాల్గొనేటప్పుడు యోని రంధ్రం దగ్గిర జైలోకైన్ జెల్లీ రాసుకుని, వేలితో వెడల్పు చేయండి. ఆపైన సెక్స్‌లో పాల్గొంటే సులువుగా అంగప్రవేశం జరుగుతుంది. నొప్పి అనిపించదు.