ప్రశ్న:-”నాకు పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాకు ఎటువంటి గైనిక్ కంప్లైంట్స్ లేవు. సాధారణంగా ఆడవాళ్ళు తెల్లబట్ట, మధ్యమధ్యలో బ్లీడింగ్, యోని దగ్గర దురదలాంటి బాధలు చెబుతారు కదా. అవి కూడా ఏనాడూ లేవు. అనుకోకుండా వారం రోజుల క్రితం ఒక వ్యక్తితో సెక్స్‌ను ఎంజాయ్ చేశాను. అతనంటే నాకెంతో క్రేజ్‌గా ఉండేది. ఎలాగైనా ఒకసారి అతనితో సెక్స్ సుఖం పొందాలని ఉండేది. అవకాశం లభించడంతో మరో ఆలోచన లేకుండా అతనితో సెక్స్ సుఖం పొందాను. ఎంతోసేపు అతనితో సెక్సులో పాల్గొన్నాను. ఎంతో థ్రిల్ అనిపించింది. కాని అతనితో పాల్గొన్న నాలుగు రోజుల నుంచి యోని నుంచి కాస్త నీరులాగా రావడం మొదలైంది. మూత్రం కూడా తరచూ వస్తోంది. యోని దగ్గర దురద అనిపిస్తోంది. ఇవన్నీ ఏవైనా వ్యాధి లక్షణాలా? లేక అతనితో ఎక్కువసేపు సెక్స్‌లో పాల్గొనడం వల్ల వచ్చిన బాధలా? తెలియకుండా ఉంది. అతనితో సెక్స్ కావాలని ఎంతగానో మనసు పడ్డప్పటికీ ఇప్పుడు ఎందుకీ పాడపని చేశానా అని బాధపడుతున్నాను. ఇక ముందు ఎప్పుడూ ఇలాంటి పనిచేయను. ఫ్యామిలీ డాక్టరుతో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇది. ఉన్నది ఉన్నట్టు జరిగినదంతా సిగ్గులేకుండా మీకు రాశాను. నా బాధని తగ్గించి పుణ్యం కట్టుకోండి.”
జవాబు:- మీకు లైంగిక సంపర్కం వల్ల సాధారణమైన క్లామిడియల్ ఇన్ఫెక్షన్‌గాని, ట్రైకామెనాస్ లేదా మొనీలియాసిస్ ఇన్ఫెక్షన్ కాని వచ్చి ఉండవచ్చు లేదా గనేరియా వ్యాధి సోకి ఉండవచ్చు. ఇటువంటి వ్యాధులు సోకినప్పుడే అంతకు ముందులేని తెల్లబట్ట అవడం, యోని దగ్గర దురద, మూత్రవిసర్జనలో మంట కలుగుతాయి. మీరు ఎజిథ్రోమైసిన్ 500 మి.గ్రా. బిళ్ళలు ఒకేసారి రెండు వేసుకోండి. సెఫిక్రిమ్ 200 మి.గ్రా. బిళ్ళలు కూడా రెండు వేసుకోండి. టినిడజోల్ 500 మి.గ్రా. బిళ్ళలు మరో రెండు వేసుకోండి. తేలికగానే బాధలు తొలగిపోతాయి. ఇంకా బాధలు మిగిలి ఉంటే సెఫిక్సిమ్ 200 మి.గ్రా. బిళ్ళలు ఉదయం రెండు, సాయంత్రం రెండు చొప్పున వారం రోజులు వేసుకోండి.