ప్రశ్న:- ”నా వయస్సు 20 సంవత్సరాలు. మావారి వయస్సు 31 సంవత్సరాలు. మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది. మంచి సంబంధం అని మా పెద్దలు వయస్సు తేడా చూడకుండా పెళ్ళి చేశారు. కాని ఆయనతో సెక్స్‌లో పాల్గొంటే ఎటువంటి థ్రిల్ ఉండటం లేదు. మా వారు రోజుకి 3-4 సార్లు నాతో సెక్స్‌లో పాల్గొంటారు. ఆయనకి మాత్రం ఎంతో ఖుషీగా ఉంటోందట. నాకు సంతోషంగా ఉండకపోవడానికి ఇద్దరి మధ్య వయస్సు తేడా ఇంత ఎక్కువ ఉండటమే కారణమా? ఆ మధ్య నా స్నేహితురాలు మాట్లాడుతూ భర్తకీ – భార్యకీ మధ్య రెండు సంవత్సరాల కంటే ఎక్కువ తేడా ఉండకూడదంది. నాలుగు సంవత్సరాల మించి ఉంటే ఎటువంటి సుఖం-సంతోషం ఉండవని చెప్పింది. నా విషయంలో అది నిజమే అనిపిస్తోంది. నేను ఏం చేయాలి?”
జవాబు:- భార్యాభర్తలు సమ వయస్కులే అయినా ఇద్దరి మధ్య 2 నుంచి 4 సంవత్సరాల గ్యాప్ ఇద్దరి వేవ్‌లెంగ్త్ ఒకటేలాగా ఉంటుంది. వయస్సు తేడా ఎక్కువ ఉన్న కొద్దీ భర్త ఫీలింగ్ ఎలా ఉన్నప్పటికీ భార్యకు మాత్రం ఆయన ఒక పెద్దాయన అన్న ఫీలింగ్ వస్తుంది. సమ వయస్కులతో మనస్సులు కలుపుకున్నట్టు పెద్దవాళ్ళతో ఫ్రీగా మూవ్ అవడం ఉండదు. భర్త కూడా బాగా తక్కువ వయస్సు ఉన్న భార్యని ఒక పిల్లలాగా, ఏమీ తెలియని దానిలాగా లెక్కగట్టేసి తన పురుషాధిక్యాన్ని చూపిస్తాడు. సెక్స్‌లో తన సుఖం వరకే చూసుకుంటాడు. పైగా వయస్సులో ఉన్న పిల్ల కనుక ఆమెతో సెక్స్ అంటే రెచ్చిపోతాడు. అమ్మాయి మాత్రం డల్‌గా ఉంటుంది. అందుకనే భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ అంతగా ఉండటం మంచిది కాదు. మీ విషయంలో పెళ్ళి జరిగిపోయింది కనుక ఏజ్ గ్యాప్ గురించి ఆలోచించకుండా ఆయనతో ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని ఎలా గడపగలరో ఆలోచించండి.