ప్రశ్న:- ”నా వయస్సు 20 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయస్సు నుంచి నాలో సెక్స్ కోరికలు కలగడం మొదలైనాయి. 14-15 సంవత్సరాలు వచ్చేసరికి కోరికలు తీవ్రమైనాయి. అబ్బాయిల్లో సెక్స్ కోరిక తీవ్రంగా ఉంటే ఏం చేస్తారో తెలియదు గానీ నేను మాత్రం యోని దగ్గర పైభాగంలో వేలుపెట్టి రుద్దుకోవడం చేస్తాను. ఒక్కోసారి యోని అంతటినీ చేయిపెట్టి గట్టిగా అదిమి పడతాను, దాంతో ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. అలా 3-4 సంవత్సరాలు చేశాను. తర్వాత అలా చేయడం తప్పు అని తెలిసింది. బలవంతంగా ఆ అలవాటు మానుకున్నాను. ఇప్పుడు నాకు తెలుపు ఎక్కువ అవుతోంది. అప్పుడప్పుడు యోని దగ్గర తెల్లగా, జిగురు సుద్దగా ఏర్పడుతోంది. నేను చేసిన పనివల్ల యోని పుండు అయిపోయిందా? నేను అసలు సెక్స్‌కి పనికి రాకుండా పోయానా? చాలా భయంగా ఉంది. నేను కాలేజీలో చదువుతున్నాను. స్టడీస్ మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. నాకు చావే శరణ్యమా?”
జవాబు:- యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరిలోను సెక్స్ స్పందనలు కలగడం సహజం. స్వయంతృప్తి పద్ధతితో సెక్స్ తృప్తి పొందడం కూడా సహజం. మీరు ఏమీ తప్పు చేయలేదు. చాలామంది అమ్మాయిలు మీలాగే స్వయం తృప్తి పొందుతారు. స్వయంతృప్తి వల్ల యోని పుండు అవదు. యోని లోపల సర్విక్స్ దగ్గర జిగురుగా మ్యూకస్ తయారవుతుంది. అది నిదానందా బయటకు వస్తుంది. అదేమీ జబ్బు కాదు. సాధారణంగా జననేంద్రియాలని వాష్ చేసుకోవడంతోనూ, పాంటీ వాడటంతోనూ ఆ జిగురు తెలియకుండా ఉంటుంది. అంతే తప్ప మీకే ప్రత్యేకంగా జిరుగు తయారవడం కాదు. మీరు ఎటువంటి దిగులూ లేకుండా చక్కగా చదువుకోండి.