ప్రశ్న:- ”నా వయస్సు 22 సంవత్సరాలు. ఇంకా పెళ్లికాలేదు. 16 సంవత్సరాలు వయస్సులో ఒక ఆంటీ ప్రోద్భలంతో అనేకసార్లు సెక్స్‌లో పాల్గొన్నాను. నాకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల హాని కలుగుతుందనే భయం కలిగింది. అంతటితో ఆమెతో సెక్స్‌లో పాల్గొనండం మానేశాను. ఆమెతోనే కాదు. ఏ స్త్రీతోనూ మళ్లీ సెక్స్‌లో పాల్గొనలేదు. కొద్ది నెలల నుంచి నాలో సెక్స్ తగ్గినట్లు అనిపిస్తోంది. ఆంటీతో సెక్స్ మానేసిన తర్వాత చాలాకాలం హస్తప్రయోగం చేసాను. ఒక్కోసారి రోజుకి 5-6 సార్లు చేసాను. ఆంటీతో సెక్స్‌లో పాల్గొనడం వల్లనో, అతిగా హస్తప్రయోగం చేయడం వల్లనో తెలీదు గాని సెక్స్ సామర్ధ్యాన్ని కోల్పోయాను. నేను పెళ్లికి పనికి రాకుండా పోయానా? ఒకవేళ పెళ్లి చేసుకున్నా భార్య ఛీకొట్టి వెళ్లిపోతుందా? నా మనసంతా గందరగోళంగా ఉంది. నన్ను మీరే రక్షించాలి.”
జవాబు:- పురుషుడు తనకంటే ఎంతో ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏ విధంగానూ నష్టపోడు. సెక్స్ డ్యామేజి అవదు. అందువల్ల ఆంటీతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల మీరు ఏమీ కోల్పోలేదు. హస్తప్రయోగం వియం కూడా అంతే. హస్తప్రయోగం ఎన్నిసార్లు చేసినా, ఎంతకాలం చేసినా ఏమీ నష్టం కలగదు. సెక్స్ విజ్ఞానం లేకపోవడం వల్ల మీలో అనవసర భయాలు కలిగాయి. ఆ భయాల వల్లే సెక్స్‌లో అసమర్థత కలిగినట్లు పరిస్థితి ఏర్పడింది. మీరు అసలు విషయాన్ని అర్థం చేసుకొంటే ధైర్యంగా మారతారు. మీరు వివాహానికి పూర్తి అర్హులే. మీకు ఎటువంటే చికిత్స అవసరం లేదు.