ప్రశ్న:- ”ఒకసారి అనుకోకుండా మా ఊరిలో అమ్మాయి దగ్గరికి పోయాను. ఆమెతో సెక్స్‌లో పాల్గొనలేదు గాని కౌగిలించుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు పూర్తిగా చేసాను. ఇద్దరం పూర్తిగా దుస్తులు తొలగించి కౌగిలించుకుని చాలాసేపు పడుకున్నాము. నేను సెక్స్ చేయడానికి భయపడటంతో ఆమె హస్తప్రయోగం చేసి వీర్యం పోగొట్టింది. అప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కాని ఇప్పుడు భయం మొదలైంది. ఆమెను ముద్దులు పెట్టుకోవడం వల్ల, కౌగిలించుకోవడం వల్ల ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందా? అనుక్షణం ఇదే ఆలోచన.
జవాబు:- కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వల్ల ఎయిడ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అయినా మీ భయం తీరడానికి రక్త పరీక్షలు చేయించుకోండి. ఇకపైన అటువంటి సరదాల జోలికి పోకండి.