Tuesday, October 19, 2021
spot_img

సెక్సుకి లేని కులం పెళ్ళికెందుకు?

ప్రశ్న:-   ”నేను ఒక దళిత అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి చాలా అందంగా, చురుకుగా ఉంటుంది. నేనంటే ఆ అమ్మాయికి కూడా ప్రాణం. కాని మా నాన్న ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. అంటరాని వాళ్ళని పెళ్ళి చేసుకుంటే నా ఆరోగ్యం చెడిపోతుందని, ఆయుష్షు తగ్గిపోతుందని, తెలివితేటలు కోల్పతానని ఏమిటేమిటో చెప్పారు. నేను అనకూడదు కాని మా నాన్నది లూజ్‌ కేరెక్టర్‌. అనేకమంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఈ విషయమై అమ్మా, నాన్నలకి మధ్య ఎప్పుడూ గొడవలే. నాకు ఒక సందేహం – సెక్స్‌కి లేని అంటరానితనం పెళ్ళికి మాత్రం ఎందుకు? చివరగా మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అంటరానివాళ్ళతో పెళ్ళి గురించి మా నాన్న అన్న మాటల్లో సైంటిఫిక్‌గా ఏమైనా నిజం ఉందా?” 

జవాబు:-     మీ నాన్నగారి మాటల్లో ఎటువంటి నిజం లేదు. సెక్స్‌కి లేని అంటరానితనం పెళ్ళికి ఎందుకు అన్న మీ హేతువాత దృష్టికి ధన్యవాదాలు. ఒకరికి ఒకరు ఇష్టపడ్డప్పుడు ఏ కులం వారినైనా, ఏ మతం వారినైనా నిర్భయంగా పెళ్ళి చేసుకోవచ్చు. మానవులంతా ఒక్కటే మీ నాన్నగారు ఒప్పుకోకపోయినా మీరు ఇష్టపడ్డ అమ్మాయిని తప్పకుండా పెళ్ళి చేసుకోండి. అంటరాని వాళ్ళంటూ ఎవరూ లేరు. సివిల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం గాని, గుళ్ళోగాని ఏ పద్ధతిలోనైనా మీరు పెళ్ళి చేసుకోవచ్చు. ఇద్దరూ హాయిగా ఉండండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!