ప్రశ్న:-”నా వయస్సు 70 సంవత్సరాలు. నా ఆరోగ్యం బాగానే ఉంటుంది. కాని కొద్దిగా నరాల వణుకు వచ్చింది. సెక్స్ కోరిక ఎప్పటి లాగానే ఉంది. అంగస్తంభనలు ఉన్నాయి. కాని ధృఢంగా ఉండడం లేదు. భార్యకి 3-4 రోజులకి ఒకసారైనా సెక్స్ కావాలనే కోరిక బలీయంగా ఉంటుంది. ఆమె కోసమైనా నేను సెక్స్‌లో పాల్గొనాలి. నాకు బి.పి., షుగర్ లేవు. ఏవైనా బిళ్ళలు వాడి సెక్స్ చేయవచ్చా? ఆ బిళ్ళలు వాడితే నరాల బలహీనత మరింత పెరిగిపోతుందా? మీరే నన్ను రక్షించాలి.”
జవాబు:- ఆరోగ్యం చక్కగా ఉంటే డాక్టరు సలహా మేరకు సిల్డినాఫిల్ లేదా టాడాల్ఫిల్ బిళ్ళలు నిరభ్యంతరంగా వాడవచ్చు. సెక్స్‌ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ బిళ్ళలు వాడటం వల్ల నరాల వీక్నెస్ రాదు. నరాల వణుకు పెరగదు. సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు బిళ్ళలు వాడైనా సెక్స్‌లో పాల్గొనడం తప్పేమీ కాదు. మీ విషయంలో డాక్టరుని సంప్రదించండి.