Saturday, October 16, 2021
spot_img

తప్పు ఆయనదైతే, శిక్ష మీకా?

ప్రశ్న:-   ”మాకు పెళ్ళై పది సంవత్సరాలైంది. ఇద్దరు పిల్లలున్నారు. మా వారికి మా బంధువుల్లో ఒకామెతో సంబంధం ఏర్పడింది. వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉంటే ముందు ఏదో అనుకున్నాను. నిన్న, మొన్నటి వరకూ మా ఆయన బంగారం అనుకున్నాను. అనుకోకుండా మొన్న ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కళ్యాణ మండపంలోని ఒక గదిలో దూరి తలుపు వేసుకున్నారు. అది నేను చూసినట్టు మా ఆయన గమనించలేదు. అరగంట పోయిన తరువాత ఇద్దరూ బయటకు వచ్చినప్పుడు నేను ఎదురుగా నుంచున్నాను. ఆ తరువాత మా ఆయన ఇక ఎప్పుడూ అలాంటి పని చేయనని పిల్లలు మీద ఒట్టువేశారు. నిజంగానే ఆమెను కలవడం లేదు. కాని నేను ఆయనతో సరిగా ఉండలేకపోతున్నాను. బంధువుల పెళ్ళిళ్ళకి, ఇతర ఫంక్షన్లకి వెళితే ఆమె ఎదురైతే పిచ్చిగా తిట్టేయవలసి వస్తుందని వెళ్ళడం మానేశాను. ఒంటరిగా ఉండిపోతున్నాను. అనుక్షణం ఏదో దిగులు, బాధ ఉంటున్నాయి. చనిపోవాలనిపిస్తుంది. ఏదో కోల్పోయిన దానిలాగా వ్యధచెందుతూ ఉంటాను. బహుశా మీ నుంచి జవాబు వచ్చేలోగా చనిపోతానేమో కూడా. నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. 

జవాబు:-     మీలో డిప్రషన్‌ చోటు చేసుకుంది. మీ జీవితంలో ఎదురైన పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు. డిప్రషన్‌ వల్లే ఒంటరిగా ఉండిపోవడం, దిగులు చెందడం, నిద్రలేకపోవడం, చనిపోవాలనిపించడం వగైరాలన్నీ. కాని ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. తప్పు ఒకరిది, శిక్ష మరొకరికి కాకూడదు. మీరేమీ తప్పు చేయలేదు. మీ వారిదే తప్పు. ఆయన బాగానే ఉన్నారు. ఏ తప్పు చేయని మీరెందుకు చావాలి? మీలోని డిప్రషన్‌కి మందులు వాడితే మీరు పూర్తిగా మామూలు అవుతారు. ఇద్దరూ కలిసి డాక్టరు దగ్గరికి వెళ్ళండి. కపుల్‌ కౌన్సిలింగ్‌ పొందండి. కపుల్‌ కౌన్సిలింగ్‌తోనూ, డిప్రెషన్‌ ట్రీట్‌మెంట్‌తోను మీ దాంపత్య జీవితం తిరిగి ఆనందదాయకంగా మారుతుంది. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా రాశారు. మీ తొందరపాటు చర్యతో ఆ పిల్లల బతుకులని పాడు చేయకండి. తప్పకుండా మీ జీవితం హ్యాపీగా మారుతుంది. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!