ప్రశ్న:-”నాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది. ఇంతకాలం ఇద్దరం చాలా ముచ్చటగా సంసారం చేశాం. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే నా భార్య ఇటీవల ఒక పురుషుని మోజులో పడింది. అతనితో గడపనిదే ఉండలేనంటోంది. నేనంటే ఇష్టమేగాని అతను కూడా కావాలంటుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతన్ని రమ్మని పిలుస్తుంది. తన పక్కకి చేరమని అతన్ని ఫోర్సు చేస్తుంది. ఏమిటి ఇదంతా అని అడిగితే అతను లేనిదే బతకలేనటుంది. ఇవన్నీ ఎటువంటి భయం, జంకు లేకుండా చెబుతోంది. భార్య మీద ఉన్న ప్రేమ కొద్దీ ఏమీ అనలేకపోతున్నాను. ఎవరైనా వశీకరణ మంత్రం చేశారని అనుమానం ఉంది. మా సంసారం చూసి ఓర్వలేక ఇలా మంత్రించేశారంటారా? అప్పటికీ మంత్రం విరుగుడుకు తాయెత్తులు కట్టించాను. ఫలితం కనబడలేదు. వశీకరణ మంత్రానికి విరుగుడు ఎలా జరుగుతుంది? నా సంసారం నిలబెట్టండి. నా భార్య చాలా మంచిది. రక్షించండి.”
జవాబు:- వశీకరణ మంత్రాలుగాని, వశీకరణ మందులుగాని, వశీకరణ రింగులు గాని లేనేలేవు. మీ ఆవిడకి అతని మీద మనస్సు కలిగి ఉండాలి లేదా మెంటల్ వచ్చి ఉండాలి. మీ మంచితనం వల్ల, భార్య మీద అతి ప్రేమవల్ల ఎవరో వశీకరణ మంత్రం వేశారని అసలు విషయాన్ని గుర్తించడం లేదు. మంత్రాలు, మాయలు లేవు. వాటి విరుగుడుకు తంతులు, తాయెత్తులు అనేవి లేవు. మీరు మీ ఆవిడని డాక్టరు దగ్గరికి తీసుకువెళ్ళండి. మెంటల్ అయితే మందులు వాడండి. మామూలు అవుతుది. ప్రవర్తనలో మార్పు అయితే సరైన కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీ ద్వారా బాగుపడుతుంది.