ప్రశ్న:-”నా వయస్సు 50 సంవత్సరాలు. గత 10 సంవత్సరాలుగా షుగర్ ఉంది. ఇదివరకు నాకు సెక్స్ కోరిక ఎక్కువ ఉండేది. మా వారు ఒకరోజు సెక్స్‌లో పాల్గొనకపోయినా ఏదో కోల్పోయినట్టు బాధపడేదాన్ని. మావారు అలిసిపోయినా నేనే చొరవ తీసుకుని సెక్సు చేసి కొంతైనా తృప్తి చెందేదాన్ని. అటువంటి దాన్ని షుగర్ వచ్చిన తరువాత సెక్సు అంటే ఆసక్తి లేకుండా అయ్యాను. మా వారు అప్పుడూ – ఇప్పుడూ ఒక్కలాగానే ఉన్నారు. వారానికి 2-3 సార్లు అయినా వారికి సెక్స్ సుఖం కావాలి. నాకేమో సెక్స్ అంటే ఇంట్రస్టే లేదు. ఏమిటీ వింత? మా సంసారం మళ్ళీ హ్యాపీగా మారుతుందా?”
జవాబు:- షుగర్ వచ్చిన స్త్రీలల్లో సెక్స్ కోరికలు తగ్గిపోవడం, సెక్స్ బాధలు కలగడం సహజం. వీరిలో సగం మందికి సెక్స్‌లో ఎగ్జైట్ అవడం, సెక్సులో సుఖప్రాప్తి పొందడం ఉండదు. దీనికితోడు షుగర్ వల్ల బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు చోటుచేసుకుని యోని పుండుగా అనిపించడం, సెక్స్‌లో పాల్గొంటే బాధ, యోని దగ్గర దురద ఉండి సెక్స్ అంటే విరక్తి కలుగుతుంది. మెనోపాజ్ దగ్గరపడి ఉంటే సెక్స్ అంటే ఆసక్తి లేకుండా అవుతుంది. డిప్రషన్‌తో సెక్స్ వద్దనిపిస్తుంది. అయినా షుగర్‌ని పూర్తిగా అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం చక్కగా అనిపించి సెక్స్‌లో ఆసక్తి పెంపొందుతుంది. మీ విషయంలో డాక్టరుకి చూపించుకుని షుగర్‌ని పూర్తిగా కంట్రోల్ చేసుకోండి. మెనోపాజ్ లక్షణాలు ఏర్పడితే చికిత్స పొందండి. డిప్రషన్ లక్షణాలుంటే మందులు వాడండి. సరైన సెక్సువల్ కౌన్సిలింగ్‌తో తిరిగి మామూలవుతారు. పూర్వంలాగానే సెక్స్‌ని ఎంజాయ్ చేస్తారు.