ప్రశ్న:- ”అబ్బాయి వయస్సు 16 సంవత్సరాలు. ఇటీవల కాలంలో వాడు బాగా నీరసించాడు. తిండి కూడా తినడం లేదు. ఎవరో చేతబడి చేసి ఉంటారని భూతవైద్యుడిచేత వైద్యం కూడా చేయించాను. యంత్రాలు, తాయెత్తులూ కూడా కట్టించాను. కానీ ప్రయోజనం కనబడలేదు. రోజు రోజుకీ మరింత నీరసపడుతున్నాడు. చేతబడి చేయబడిన వానికి మందులు ఉంటాయా? చేతబడికి విరుగుడు చేయించడం ఒక్కటే మార్గమా?”
జవాబు:- చేతబడి, బాణామతి అనేవి లేనేలేవు. ఎవరో మంత్రాల ద్వారా నష్టం చేస్తారనేది ఒట్టిది. క్షుద్ర విద్యలు అనేవి లేనేలేవు. మీ అబ్బాయి ఆరోగ్యం క్షీణించడానికి వేరే అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. సరైన డాక్టరుకి చూపించి పూర్తి వైద్య పరీక్షలు చేయించండి. అతను నీరసపడటానికి కారణం ఏమిటో తెలుస్తుంది. కారణం బట్టి చికిత్స చేస్తే తప్పకుండా కోలుకుంటాడు. కొందరు సరైన వైద్యం చేయించుకోరు. దాంతో రోగం తగ్గదు. రోగం తగ్గలేదు కనుక సరైన వైద్యుడికి చూపించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. మీ వాడ్ని డాక్టరుకి చూపించండి. తప్పకుండా కోలుకుంటాడు.