Saturday, October 16, 2021
spot_img

‘చేతబడులు’, ‘గాలి’ లేవు

ప్రశ్న:-   ”అకారణంగా బరువు తగ్గుతూ ఉంటే ఏదైనా గాలి సోకినట్టా? చేతబడి చేసినట్టా? మందు పెట్టినట్టా?” 

జవాబు:-     గాలి సోకడం, చేతబడి, మందు పెట్టడాలు లేనే లేవు. అందువల్ల వాటివల్ల బరువు కోల్పోవడం అనేది లేదు. అకారణంగా బరువు కోల్పోవడం అనేది ఉండదు. దానికి ఏదొక కారణం ఉంటుంది. అది శారీరక కారణం కావచ్చు లేదా మానసిక కారణం కావచ్చు. కొందరు ఏమాత్రం బరువు కోల్పోరు. అయినా వారికి చిక్కిపోతున్నామని ఫీలింగ్‌ ఏర్పడుతుంది. దానికి తోడు ఎవరైనా ప్రేమ కొద్దీ తగ్గిపోయావేంటి అని అంటే ఆ మాటలని నిజమే అనుకుని తగ్గిపోయామని ఫీలవుతారు. కాని బరువు మాత్రం తగ్గరు. ఎవరైనా తగ్గిపోతున్నామని అనుకుంటే ఆకలి ఎలా ఉంది. ఆహారం ఎంత తీసుకుంటున్నారనేది గమనించాలి. జీర్ణకోశ వ్యాధులు, లివరు జబ్బులు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. కొందరిలో షుగరు వ్యాధి ముదిరిపోయి బరువు కోల్పోవడం ఉంటుంది. బాగా నీరసపడతారు. అందుకని షుగరు వ్యాధి ఉందేమో చూడాలి. క్షయ వ్యాధి ఉన్నప్పుడు కూడా బరువు కోల్పోవడం ఉంటుంది. థైరాయిడ్‌ గ్రంథి అధికంగా పనిచేస్తున్నా బరువు కోల్పోవడం ఉంటుంది. కేన్సరు ఉన్న మనిషి తగ్గిపోవచ్చు. ఎయిడ్స్‌ వ్యాధివల్ల కూడా మనిషి బరువు కోల్పోవచ్చు. ఇవే కాకుండా ఇంకా అనేక వ్యాధులు బరువు కోల్పోవడానికి కారణాలు అవుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని రోగిని పరీక్ష చేయాలి. కారణం బట్టి చికిత్స చేస్తే రోగి కోలుకోవడం ఉంటుంది. ఏవో కొద్దిపాటి పరీక్షలు చేసి బరువు కోల్పోవడానికి కారణం అంతుపట్టలేదు కనుక గాలి, దెయ్యం, చేతబడి అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం, అజ్ఞానం మరొకటి ఉండదు.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!