ప్రశ్న:- ”నాకు రొమ్ములో గడ్డలు తయారైనాయి. చాలా భయంగా ఉంది. ఇవి కేన్సర్ గడ్డలు అవుతాయా?”
జవాబు:- ఈ రోజుల్లో రొమ్ములో గడ్డలు ఏవైనవీ తెలుసుకోవడం అతి సింపుల్ అయిపోయింది. డాక్టరుకి చూపించుకోండి. ఎఫ్.ఎన్.ఎ.సి. టెస్టు ద్వారా గానీ, బయాప్సీ ద్వారా గానీ, మమ్మోగ్రఫీ ద్వారా గానీ చాలా తేలికగా ఏమైనదీ తెలుసుకోవచ్చు. దానిని బట్టి చికిత్స చేస్తే కేన్సర్ తొలిదశలోనే అయినా పూర్తిగా క్యూర్ అయిపోతుంది. రొమ్ములో గడ్డలన్నీ కేన్సర్ గడ్డలు కాదు. డాక్టరుకి చూపించుకుంటే ఏదైనదీ నిర్ధారణ చేస్తారు. అంతే తప్ప చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ, ఇంకా పెరుగుతూ ఉంటే డాక్టరుకి చూపించుకుందామని ఆగితే కేన్సరు గడ్డలు ముదిరిపోయే ప్రమాదం ఉంది. వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్ళండి.