Friday, October 22, 2021
spot_img

వీర్యం బదులు రక్తం వస్తుందా?

ప్రశ్న:-   ”నా వయస్సు 78 సంవత్సరాలు. ఆరోగ్యంగానే ఉన్నాను. భార్య చనిపోయి 20 సంవత్సరాలు అయ్యింది. ఇటీవల మా బంధువులామె నాతో సరస సంభాషణ చేస్తూ సెక్స్‌కి సంకేతాలు ఇచ్చింది. ఆమె వయస్సు 60 సంవత్సరాలు. ఇంత వయస్సు వచ్చినా సెక్స్‌కోసం వెంపర్లాడటం పోలేదు. ఆవిడ ఎలాగూ కోరుతోంది కనుక సెక్స్‌కి రెడీ అన్నాను. ఇద్దరం బాగానే ఎంజాయ్‌ చేసాం. అసలు మలుపంతా ఇక్కడే మొదలైంది. సెక్స్‌ పూర్తి అయిన తర్వాత చూస్తే నా పురుషాంగానికి రక్తం అంటుకుని ఉంది. ఆవిడ లోపల లంగా కూడా రక్తం మరకలు ఏర్పడ్డాయి. ఆవిడా భయపడింది, నేను భయపడ్డాను. ఆవిడ నా నుంచి రక్తం అంటే నేను నీ నుంచి రక్తం అని వాదులాడుకున్నాం. తనకి ముట్లు ఎప్పుడో ఎండిపోయాయి కనుక తన నుంచి రక్తం వచ్చే ప్రశ్నేలేదు, పొమ్మంది. దాంతో నా పురుషాంగంలో నుంచే రక్తం వచ్చిందని అదిరిపోయాను. వృద్ధాప్యంలో సెక్స్‌లో పాల్గొంటే వీర్యం బదులు రక్తం వస్తుందా? మీ నుంచి సమాధానం వచ్చేవరకు నా మనస్సు శాంతించదు. త్వరగా జవాబు ఇవ్వండి.”

జవాబు:-     సెక్స్‌లో పాల్గొన్నప్పుడు రక్తం రావడం మీ నుంచి కాదు. ఆవిడ నుంచే వచ్చింది. వయస్సు మళ్ళిన కొందరి స్త్రీలల్లో గర్భాశయం కంఠం దగ్గర కేన్సరు పుండు తయారవుతుంది. చాలామందిలో మొదటి దశలో అది చాలా సైలెంట్‌గా ఉంటుంది. సెక్స్‌లో పాల్గొనప్పుడు పురుషాంగం ఒత్తిడితో కేన్సరు పుండు నుంచి రక్తం కారుతుంది. అందుకనే మామూలుగా సంసారం చేస్తున్న దంపతులైనప్పటికీ 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత సెక్స్‌లో పాల్గొన్నప్పుడు రక్తం కొద్దిగా కనబడినా సర్వైకల్‌ కేన్సరు ఉన్నదేమో పరీక్ష చేయించుకోవాలి. అంతేగాని ఏదో వేడి చేయడం వలన అనుకుని ఊరుకోకూడదు. వయస్సు మళ్ళిన కొందరి స్త్రీలలో మెసోపాజ్‌ వచ్చిన తర్వాత కేన్సరు కాకుండా కూడా యోనిలో నుంచి కొంత రక్తం స్రవించవచ్చు. మెనోపాజ్‌ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి బాగా తగ్గిపోయి యోనిలోపల గోడలు పలచనై సెక్స్‌లో పాల్గొన్నప్పుడు రక్తం రావచ్చు. ఇలా రావడం కేన్సరుకి సంబంధించిన పరిస్థితి మాత్రం కాదు. మీరు సెక్స్‌లో పాల్గొన్న స్త్రీని వెంటనే గైనిక్‌ చెకప్‌ చేయించుకోమనండి.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!