Friday, October 22, 2021
spot_img

రక్తమార్పిడికే ఎయిడ్స్‌ తగ్గదు

ప్రశ్న:-   ”హెచ్‌.ఐ.వి./ఎయిడ్స్‌ వచ్చిన వాళ్ళల్లో ఆ వ్యాధి క్రిములతో రక్తం కలుషిత మవుతుందని అంటారు కదా. ఇటువంటి వాళ్ళకి రక్తం తీసేసి ఆరోగ్యవంతుల రక్తాన్ని ఎక్కిస్తే సరిపోదా! దాంతో ఎయిడ్స్‌ వ్యాధి తగ్గిపోదా?”

జవాబు:-     ఎయిడ్స్‌ వ్యాధి శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఆ క్రిములు రక్తంలో ఉండిపోవడమే కాకుండా లింఫ్‌ గ్రంథుల్లోకి, మెదడు, ఇతర అవయవాల్లోకి, ద్రవాల్లోకి చేరిపోతాయి. అందువల్ల కేవలం రక్త మార్పిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. బిందెలో నీరు ఉంటే పాత నీరంతా పారబోసి కొత్తనీరు పోసినట్టు శరీరంలోని రక్తమంతా ఒక్క పక్క నుంచి లాగి వేసి రెండవ పక్కనుంచి మంచి రక్తం ఎక్కించడం కుదిరేది కాదు. అందుకని రక్తమార్పిడితో ఎయిడ్స్‌ని నయం చేస్తామని చెబితే అర్థంలేని మాట.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!