Tuesday, October 19, 2021
spot_img

అరుదుగా అబ్బాయిలకీ వక్షోజాలు

ప్రశ్న:-   ”నా వయస్సు 19 సంవత్సరాలు. నా వక్షోజాలు ఆడవారిలాగా పెద్దవిగా ఉన్నాయి. అందరూ నన్ను హేళన చేస్తున్నారు. మందులతో పెద్దవిగా ఉన్న వక్షోజాలు తగ్గుతాయా? మగవాళ్ళకి వక్షోజాలు ఉంటే ఆడవాళ్ళ లాగా మారిపోతారా? ఇప్పటికే నాకు అటువంటి అనుమానం కలుగుతోంది. నా మాటగాని, నా నడకగాని ఆడంగిలాగా ఉన్నాయని హేళన చేస్తున్నారు. ఇదివరకు నాకు ఆడదాని మాటలు, నడక లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలి?” 

జవాబు:-     కొందరు మగ పిల్లలకి ఆడవాళ్ళల్లోలాగా వక్షోజాలు పెరుగుతాయి. ఎందుకిలా పెరుగుతాయో స్పష్టమైన కారణం తెలియదు. ఆడవారిలాగా వక్షోజాలు ఉన్నప్పటికీ స్త్రీగా మారిపోవడం ఉండదు. మీ విషయంలో ఇదివరకు లేకుండా ఇటీవల కాలంలోనే స్త్రీలాగా మాట్లాడటం, నడవడం ఉందంటే సజస్జిబిలిటీ మెంటాలిటీ వల్ల ఆడదానిగా మారిపోతున్నాననే ఫీలింగ్‌తో అలా ప్రవర్తిస్తున్నారనుకోవాలి. ఆపరేషన్‌ ద్వారా మీకు పెరిగిన వక్షోజాలని తేలికగా తొలగింఛవచ్చు. మానసిక చికిత్స ద్వారా స్త్రీలలాగా మాట్లాడటం, నడవడం తొలగించవచ్చు. మీరు త్వరగా డాక్టరుని సంప్రదించండి.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!