ప్రశ్న:- ”నా వయస్సు 17 సంవత్సరాలు. ఇంటర్ చదువుతున్నాను. నా పాలిండ్లు చాలా పెద్దవిగా తయారైనాయి. ఎంత అణచిపెట్టి కట్టుకున్నా ఎబ్బెట్టుగా కనబడుతున్నాయి. నా ఫ్రెండ్స్ నన్ను చాలా హేళన చేస్తున్నారు. ”నువ్వు పెళ్ళి చేసుకుంటే, పిల్లలని కంటే, ఒకే కాన్పులో ఇద్దరిని కను. ఒక్కళ్ళనే కంటే వాళ్ళకి నీ పాలు ఎక్కి తక్కి అయి పుట్టే బిడ్డకి అజీర్ణ బాధ తలెత్తుతుంది అని ఏడ్పిస్తున్నారు. నా పరిస్థితికి ఏదన్నా పరిష్కారం ఉందా?”
జవాబు:- కొందరు అమ్మాయిలకి తక్కిన వాళ్ళ కంటే పాలిండ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. పాలిండ్లు పరిమాణంలో పెద్దవిగా ఉన్నప్పటికీ పాల ఉత్పత్తి మామూలుగానే ఉంటుంది. మీ పాలిండ్లు పెద్దవిగా ఉన్నాయని సిగ్గుతో తల వంచుకోనవసరం లేదు. ప్లాస్టిక్ సర్జన్కి చూపించండి. వాటి పరిమాణాన్ని తగ్గించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.