ప్రశ్న:- ”చంటిపిల్లలకి ఫిట్స్ వస్తే కాలుతున్న చుట్టతో నుదుటి మీద కాలుస్తారు. అలా కాల్చడం వల్ల ఫిట్స్ పోతాయా? పొట్ట ఉబ్బరంగా ఉంటే పొట్ట మీద చురకలు వేస్తారు. దాంతో కడుపులోని వాతం తొలుగుతుందా? పచ్చకామెర్లు వచ్చినప్పుడు మణికట్టు మీద గుండ్రంగా కాలుస్తారు. కామెర్లు తగ్గడానికి ఈ వైద్యం ఎంత వరకు తోడ్పడుతుంది?”
జవాబు:- వాతల వైద్యం, చురకల వైద్యం అర్థం లేనివి. వాటివల్ల ప్రయోజనం లేదు సరికదా నష్టం కూడా ఉంది. కొందరు ఇటువంటి మోటు వైద్యాల వల్ల ధనుర్వాతం వచ్చో, సెప్టిక్ అయ్యో అన్యాయంగా ప్రాణాలు కోల్పోతారు. ఫిట్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కారణాన్ని బట్టి మందులు వాడాలి. మూల కారణాన్ని కనుగొని చికిత్స చేయాలే గాని మణికట్టు మీద కాల్చడం లేదా కాల్పించుకోవడం ఒట్టి మూర్ఖత్వం. సరైన వైద్య విజ్ఞానం ఉన్నప్పుడు ఇటువంటి మోటు వైద్యాలు మూర్ఖపు పనులు ఉండవు.