Tuesday, October 19, 2021
spot_img

నిర్మూలన కాకున్నా నిలకడగా ఉంచవచ్చు

ప్రశ్న:-”ఎయిడ్స్‌ రోగిని. మరణశిక్ష పడ్డ వానిలాగా కృంగిపోయి ఉన్నాను. చావు అంటే ఎవరికైనా భయమే కదా. సడన్‌గా మృత్యువాత పడితే ఫరవాలేదు, అలా కాకుండా ఈ జబ్బుతో చావు తప్పదు అని తెలిసినప్పుడు ఎంత భయంగా ఉంటుందో ఆ భయంతో బ్రతికే వాళ్ళకే తెలుస్తుంది. మశూచి, ప్లేగు వంటి భయంకరమైన వ్యాధులని సమూలంగా నిర్మూలించగలిగిన వైద్యశాస్త్రం ఎయిడ్స్‌ని నయంచేసే మందుని కనిపెట్టలేకపోవడమేమిటి? వైద్య శాస్త్రానికి కూడా ఎయిడ్స్‌ రోగులంటే చిన్న చూపా?” 

జవాబు:-ఆధునిక వైద్యశాస్త్రం కోట్లాది రూపాయలని ఖర్చుచేసి ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ కోసం, ఎయిడ్స్‌ మందుకోసం ఎంతగానో కృషి చేస్తోంది. ఎయిడ్స్‌ వైరస్‌ ఈ పరిశోధనలకు అంత తేలికగా లొంగడం లేదు. దాని నిర్మూలన కోసం ఒక మందు కనిపెడితే అది మరొక కొత్త రూపం ఎత్తి తప్పించుకుంటోంది. అయినా రీసెర్చి చాలావరకు సక్సెస్‌ అవుతోంధి. అనతికాలంలోనే వ్యాక్సిను, క్యూర్‌కి మందు వస్తుంది. ఈ లోపల మంచి ఆహారం తీసుకుంటూ, మంచి అలవాట్లు పాటిస్తూ, ఆరోగ్యకరమైన పరిసరాల్లో నివసిస్తూ, మానసికంగా ప్రశాంతంగా ఉంటూ, అవసరాన్ని బట్టి ఎ.ఆర్‌.వి. మందులు వాడితే ఆరోగ్యం చాలావరకు నిలకడగానే ఉంటుంది. ఎయిడ్స్‌ పూర్తిగా నయం అవడానికి మందులు లేకపోయినప్పటికీ ప్రస్తుతం వ్యాధి ముదరకుండా అడ్డుకట్టవేసే మందులు ఉన్నాయి. కొన్ని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ మందులు ఉచితంగా కూడా ఇస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో కూడా మంచి చికిత్సలు అంధుబాటులో ఉన్నాయి. అందువల్ల ఎయిడ్స్‌ రోగులకు వైద్యం లేదని కృంగిపోనవసరం లేదు. ఆశతో జీవించండి. ఆశ జీవితాన్ని చిగురింపజేస్తుంది. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!