ప్రశ్న:-”నా వయస్సు 30 సంవత్సరాలు. బి.టెక్. చేశాను. ఈ రోజు వరకు చదువు మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాను. ఉద్యోగం చేస్తున్నాను. ఎప్పుడూ హాస్టల్లో ఉండటం, స్నేహితులు చుట్టూ ఉండటంతో సెక్స్ ఆలోచనలు వచ్చినా హస్తప్రయోగం చేయాలని అంతగా అనుకోలేదు. అందుకనే 2-3 వారాలకి ఒకసారే హస్తప్రయోగం చేశాను. ఇంట్లో పెళ్ళి చేసుకోమని పోరు పెడుతున్నారు. ఇప్పుడు నాకు నా సెక్స్ సామర్థ్యం మీద డౌట్ వచ్చింది. నా స్నేహితులు చాలామంది పెళ్ళి కాకుండానే అమ్మాయిలతో కలిశారు. వేశ్యల దగ్గరకి వెళ్ళారు. నేను అలా చేయలేదు. నాలో సెక్స్ అసమర్థత ఉండబట్టే అలా చేయలేదని ఇప్పుడు అనుకుంటున్నాను. పెళ్ళి చేసుకోవాలంటే భయంగా ఉంది. నాకు ఒక సంబంధం చూశారు. ఆ అమ్యాయి చాలా చురుకుగా ఉంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత మరింత భయం పట్టుకుంది. నేను ఆ అమ్మాయితో సమానంగా సెక్స్‌లో ఉండకపోతే పాయింట్ ఫైవ్ వాడిగా ముద్రవేస్తుందని భయం వేస్తోంది. మీరే నాకు మార్గం చూపాలి.”
జవాబు:-సాధారణంగా ఈ రోజుల్లో యూత్ తమ స్టడీస్ గురించి, కెరీర్ గురించీ, లైఫ్‌లో సెటిల్ అవడం గురించి ఎక్కువ తహతహలాడుతున్నారు. దాంతో వాళ్ళల్లో సెక్స్ సెకండరీ అయింది. అందుకని సెక్స్ ఆలోచనలు తక్కువ ఉంటున్నాయి. అంత మాత్రాన వాళ్ళల్లో సెక్స్ తక్కువ ఉన్నట్టు కాదు. పెళ్ళి చేసుకుంటే బాగానే ఉంటారు. అయితే పెళ్ళి చేసుకున్న తర్వాత వైవాహిక జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలుసుకోవాలి. లేనిపక్షంలో సెక్స్ లైఫ్ విషయంలో మైండ్ ట్యూన్ అవదు. కేవలం కెరీర్ గురించేే ఆలోచన ఉంటుంది. ఈ మోడర్న్ ఏజ్‌లో చాలామంది వైవాహిక జీవితంలో సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఆ విషయంలో మనస్సు పెట్టకపోవడమే. సెక్స్ గురించి మనస్సు పెట్టకపోతే ఆ ఆలోచనలు రావలసిన తీవ్రతలో రావు. ఈ విషయాన్ని గుర్తించి జీవితంలో ఎంతో ముఖ్యమైన వైవాహిక జీవితం గురించి కూడా మైండ్‌ని ట్యూన్ చేయండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నిర్భయంగా పెళ్ళి చేసుకోండి.