Saturday, October 16, 2021
spot_img

నేను పెళ్ళి చేసుకోవచ్చా?

ప్రశ్న:-   ”సార్‌ నా వయస్సు 25 సంవత్సరాలు. నేను పి.జి. చదువుతున్నాను. ఈ మధ్య నేను ఒక ఆంటీతో సెక్స్‌లో పాల్గొన్నాను. ఆమె వయస్సు కూడా 25 సంవత్సరాలు. ఆమెను నేను సంతృప్తిపరచలేదు. దాంతో ఆమె నన్ను వేస్ట్‌ అంది. నా అంగం పూర్తిగా గట్టిపడటం లేదు. బాగా భయం వేస్తుంది. నేను ఇంతకుముందు హస్తప్రయోగం చేసేవాడిని. అప్పుడు నా అంగం బాగానే వుండేది. ఆమె మాటలతో నాకు భయం వేస్తోంది. నేను పెళ్ళి చేసుకోవచ్చా? నేను ఇంతవరకు ఎలాంటి సెక్స్‌ ప్రేరేపిత మందులు వాడలేదు. ఒకవేళ నాకు మందులు అవసరమైతే తెలియజేయండి. నాకు మామూలు సమయంలో అంగం గట్టిగా వుంటుంది. ఆమెను కలిసిన 3 రోజుల నుండి అంగం పూర్తిగా స్తంభించటం లేదు. దాంతో నాకు భయం మరింత ఎక్కువైంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలపండి. ఒకవేళ డాక్టర్‌ను కలవాలంటే ఏ స్పెషలిస్ట్‌ని కలవాలో తెలియజేయండి?” 

జవాబు:-     హస్తప్రయోగం చేస్తున్నప్పుడు అంగం స్థంభించడమనేది ఉన్నప్పుడు సెక్స్‌ సామర్థ్యం బాగానే వున్నట్లు భావించాలి. ఆంటీ దగ్గర కంగారు పడటంతో అంగం స్థంభించలేదు. మనస్సులో భయం కలిగినా, కంగారు వచ్చినా, ఎదుటివాళ్ళ డిమాండ్‌ మేరకు చేయగలనా లేదా అనే ఫీలింగ్‌ కలిగినా అంగం స్థంభించదు. మీ విషయంలో ఇదే జరిగింది. అంతే తప్ప మీలో సెక్స్‌ సామర్థ్యం లేకపోవడం కాదు. దీనికి తోడు ఆమె మాటలు మిమ్మల్ని మరింత కృంగదీసాయి. దాంతో మీ మీద మీకే నమ్మకం పోయింది. మీరు సెక్స్‌ కోల్పోవడానికి ఇది ఒక కారణం. మీకు ఏ డాక్టరు, పరీక్షలు అవసరం లేదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. అంతా సవ్యంగా మారిపోతుంది. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!