Saturday, October 16, 2021
spot_img

నేను జిమ్‌ చేయవచ్చా?

ప్రశ్న:-”నా వయస్సు 28 సంవత్సరాలు. ఇటీవల ఒకరికి రక్తదానం చేయడానికి వెళితే నాకు హెచ్‌.ఐ.వి. ఉందని తేలింది. కాని నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రోజూ కనీసం గంటసేపు జిమ్‌ ప్రాక్టీసు చేస్తాను. నా పర్సనాలిటీ చక్కగా ఉంటుంది. ఎటువంటి నీరసం, అలసట లేవు. హెచ్‌.ఐ.వి. ఉంటే జిమ్‌ చేయవచ్చా? చేయకూడదా? జిమ్‌ మానేయాలంటే బాధగా ఉంది. నేనేం చేయాలో చెప్పండి.” 

జవాబు:- హెచ్‌.ఐ.వి. ఉన్నప్పటికీ అన్ని పనులు మామూలుగా చేసుకోవచ్చు. ఏదీ మాననవసరం లేదు. ఓవర్‌గా స్ట్రెయిన్‌ అవడం మాత్రం మంచిది కాదు. రోజూ ఒక గంట జిమ్‌ చేయడం మంచిదే. అది ఆరోగ్యాన్ని బాగానే కాపాడుతుంది. అలసట, నీరసం అనిపిస్తే మాత్రం తగ్గించండి. హెచ్‌.ఐ.వి. ఉన్నవాళ్ళు మంచి ఆహారం తీసుకుంటూ మంచి అలవాట్లు కలిగి ఉంది, కంటినిండా నిద్రపోతే ఆరోగ్యం బాగానే ఉంటుంది. రోజూ కొద్దిపాటి వ్యాయామం కూడా అవసరమే. మీ విషయంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు అవసరం లేదు. డాక్టరుతో అప్పుడప్పుడూ పరీక్ష చేయించుకుంటూ ఉండండి. 

spot_img

Must Read

Previous articleCan I Go To Gym?
Next articleBlood Instead Of Semen!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!