Tuesday, October 19, 2021
spot_img

మెనోపాజ్‌ బాధలు తప్పవా?

ప్రశ్న:-   ”నా వయస్సు 50 సంవత్సరాలు. ఇదివరకు నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, ఆ మూడ్‌లో నా పిల్లలతో, కోడలితో కూడా ఎంతో కులాసాగా ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా, ఏం మాట్లాడినా అరుస్తున్నాను. ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడా కంట్రోలు చేసుకోలేకపోతున్నాను. మహిళల్లో ముట్టుడిగే వేళ వివేకం లోపిస్తుందని ఎక్కడో చదివాను. ఏదో తెలియని అలసట, నీరసం. చలికాలంలో కూడా చెమట్లు ఎక్కువగా పోయడం, ఒంట్లోంచి వేడి ఆవిర్లు రావడం ఉంటున్నాయి. నాకు కేన్సరు లాంటి జబ్బు మొదలవుతోందనా? నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలనా?”

జవాబు:-     స్త్రీలలో మెన్సస్‌ శాశ్వతంగా ఆగిపోయే ముందుగాని, తర్వాతగాని మానసిక, శారీరక బాధలు కొన్ని తలెత్తుతాయి. వీటినే మెనోపాజ్‌ లక్షణాలు అంటారు. చాలామంది మహిళలు మెనోపాజ్‌ లక్షణాలని తెలుసుకోరు. ఓపిక పోయిందని భావిస్తూ – బి – కాంప్లెక్స్‌, ఐరన్‌ బిళ్ళలు వేసుకుంటారు. కాని ప్రయోజనం ఉండదు. మెనోపాజ్‌ బాధలకి చక్కని చికిత్స ఉంది. ఆరు నెలల నుంచి 2 సంవత్సరాల వరకు మందులు వాడవలసి ఉంటాయి. డాక్టరుకి చూపించుకుని మెనోపాజ్‌ లక్షణాలు అయినవీ, కానివీ నిర్ధారణ చేసుకుని చికిత్స పొందండి. తప్పకుండా తిరిగి మామూలు మనిషి అవుతారు. అందరితో కలివిడిగా ఉంటూ హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తారు.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!