Saturday, October 16, 2021
spot_img

ఆముదమే అనారోగ్యకారి

ప్రశ్న:-   ”మాకు చంటిబాబు ఉన్నాడు. ఎప్పుడూ కడుపులో నొప్పితో బాధపడతాడు. సరిగ్గా తిండి తినడు. ఈనాడు ఎవరూ కూడా పిల్లలకి ఆముదం పట్టడం లేదు కనుక మా వాడికి కూడా ఆముదం పట్టలేదు. చంటి బిడ్డకి ఆముదం పట్టకపోవడం వల్లే ప్రేగుల్లో వాతం చేరిపోయి కడుపునొప్పి వస్తోందని మా బామ్మ రోజూ గోల పెడుతోంది. చంటి పిల్లలకి ఆముదం పడితే ఏ బాధలూ లేకుండా ఆరోగ్యంగా ఉంటారా?”

జవాబు:-     చంటి బిడ్డలకి ఆముదం పట్టడం తప్పు. ఆముదం పట్టడం వల్ల లాభం లేదు సరికదా నష్టం ఉంది. ఆముదం తాగించడం వల్ల జీర్ణకోశం ప్రేగుల్లో కదలిక వేగంగా వుండి ఆహారంలోని పౌష్టిక విలువల్ని పేగు పీల్చుకోకుండా కిందికి నెట్టివేయబడతాయి. దానివల్ల బిడ్డ ఎదుగుదలలో, ఆరోగ్య రక్షణలో లోపం ఏర్పడుతుంది. బిడ్డ డుపులోని వాతం పోవడానికని, రోజూ విరోచనం అవ్వాలని ఆముదం పట్టాలనుకోవడం తప్పు. ఏమీ పట్టకపోయినా సహజ సిద్ధంగా విరోచనం అవుతుంది. ఆముదం పట్టడం వల్ల ఒక్కోసారి పేగులు అడ్డం పడి ప్రమాదం కూడా కావచ్చు. మీ బిడ్డ కడుపు నొప్పికి వేరే కారణం ఉంటుంది. డాక్టరుకి చూపించండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!