ప్రశ్న:- ”నేను ఒక వేశ్యతో సెక్స్‌లో పాల్గొన్నాను. ఆమెతో సెక్స్‌లో పాల్గొన్న 4-5 రోజులకి పురుషాంగం మీద చర్మం పుండుగా మారింది. 4-5 పుళ్ళు పడ్డాయి. బాగా నొప్పి అనిపించింది. ఆ తర్వాత పురుషాంగం మీద చర్మం బిగుసుకు పోయింది. గజ్జల్లో రెండు ప్రక్కలా బిళ్ళలు కట్టాయి. అవికూడా నొప్పి చేశాయి. సలపరం, చలిజ్వరం వచ్చాయి. ఇదేమైనా ఎయిడ్స్ వ్యాధా? వేశ్యతో కలవడం ఇదే మొదటిసారి. ఒక్కసారికే ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది ఏమిటి? ఇక జన్మలో తప్పు చేయను. నన్ను ఈ జబ్బు నుంచి రక్షించండి.”
జవాబు:- మీకు వేశ్యా సంపర్కం వల్ల షాంక్రాయిడ్ వ్యాధి సంక్రమించింది. ”డాక్సిసైకిలిన్” 100 మి.గ్రా. క్యాప్సుల్స్ ఉదయం -1, సాయంత్రం-1 చొప్పున 14 రోజులు వాడండి. గజ్జల్లోని చీముగడ్డలని ఓపెన్ చేసి చీము తీసేయాలి. అప్పుడు గాని బాధ తగ్గదు. డాక్టరుకి చూపించండి. తగిన చికిత్సతో బాగుపడతారు. మీకున్న వ్యాధి లక్షణాలు ఎయిడ్స్ కాదు. కాని సుఖవ్యాధులతో పాటు ఎయిడ్స్ కూడా సంక్రమించే అవకాశం ఉంది. అందుకని డాక్టరుకి చూపించుకుని ఎయిడ్స్ సోకినదీ లేనిదీ నిర్ధారణ చేసుకోండి.