Friday, October 22, 2021
spot_img

కాన్పు తరువాత శుభ్రత అవసరం

ప్రశ్న:-”నా భార్య రెండు రోజుల క్రితమే ప్రసవించింది. అందరూ రకరకాలుగా చెబుతున్నారు. బాలింతరాలు తెలుసుకోవలసిన విషయాలతో పాటు దాంపత్యంలో ఎప్పటి నుంచి పాల్గొనవచ్చో తెలియజేయండి.” 

జవాబు:- కాన్పు ఎప్పుడూ ఆసుపత్రిలోనే జరగాలి. కాన్పు చేసిన డాక్టరు బాలింతరాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా తప్పకుండా తెలియజేస్తారు. అయినా చాలామంది అర్థంలేని మూఢనమ్మకాలలో డాక్టరు చెప్పినట్టు చేయరు. ఏ ముసలమ్మో చెప్పిందని ఆమె చెప్పినట్టు చేస్తారు. కాన్పు అయిన తర్వాత వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. శుభ్రం లేకపోతే ఇన్‌ఫెక్షన్‌ వచ్చి జ్వరం వస్తుంది. కొందరు బాలింతరాళ్ళు పచ్చి ఒళ్ళు అని మంచినీళ్ళు తాగరు. నిజానికి కాన్పు అయిన మరుక్షణం నుంచి కడుపునిండా మంచినీళ్ళు తాగాలి. బాలింతరాలు స్నానం అని వారం – పది రోజుల వరకూ స్నానం చేయరు. కాన్పు బడలిక తీరిన 1-2 రోజుల్లోనే తలారా స్నానం చేయవచ్చు. బాలింతరాలుకి పాలు పడటానికి రెండు-మూడు రోజులు పడుతుంది. కాని కాన్పు అయిన గంట లోపలే రొమ్ము పట్టించాలి. దానివల్ల పాలు త్వరగా పడతాయి. మొదటి రెండు రోజులు పాలు లేకపోయినా కొలెస్ట్రం అనే ద్రవం వస్తుంది. ఇది పసిబిడ్డకు ఎంతో అవసరం. ఇందులోని యాంటీబాడీస్‌, విటమిన్‌ ‘ఎ’ బిడ్డకు జీవితాంతం తోడ్పడతాయి. బాలింతరాలకి పథ్యం పేరిట సరిగ్గా తిండిపెట్టరు. ఒక పూటే భోజనం పెడతారు. జలుబు చేస్తుందని పళ్ళరసాలు, మజ్జిగ వాడనివ్వరు. ఇవన్నీ మూఢ నమ్మకాలు. బాలింత రాలిని పథ్యం పేరిట ఎండగట్టడంలో అర్థంలేదు. మామూలుగా ఇంటిలో ఏం వండుకుటారో అవన్నీ భోజనంలో పెట్టాలి. కాన్పు అయిన మరుసటి రోజు నుంచే రెగ్యులర్‌గా అబ్డామినల్‌ ఎక్సర్‌సైజ్‌, స్పైనల్‌ ఎక్సర్‌సైజు చేయాలి. దానివల్ల నడుంనొప్పి రాదు. వారం రోజుల తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. ఆరు వారాలు గడిచిన దగ్గర నుంచీ మామూలుగా దాంపత్య సంబంధాలలో పాల్గొనవచ్చు. రెండో బిడ్డకి ఎడం ఉండేందుకు కనీసం రెండు సంవత్సరాలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలి. బాలింతరాలి విషయంలో ఎన్నో మూఢ నమ్మకాలు ఉన్నాయి. వాటిని విడనాడాలి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!