ప్రశ్న:- ”ఎండాకాలంలో నిమ్మకాయ సోడా తాగితే జలుబు చేస్తుందని అంటారు. అలాగే జలుబు ఉన్నప్పుడు లెమన్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ తీసుకున్నా జలుబు ఎక్కువ అవుతుందని అంటారు. జలుబు ఉన్న వాళ్ళు నిమ్మ, నారింజ, ద్రాక్ష రసాలకి దూరం కావలసిందేనా?”
జవాబు:- నిమ్మకాయ సోడా తాగితే జలుబు చేయదు. జలుబు ఉన్నప్పుడు నిమ్మ, నారింజ, ద్రాక్ష తీసుకున్నా జలుబు పెరగదు. పైగా జలుబు ఉంటే త్వరగా తగ్గుతుంది. అంతకు ముందు నిమ్మ, నారింజ, ద్రాక్ష రసాలు తీసుకోకపోయినా జలుబు ఉన్న సమయంలో తీసుకుంటే ప్రయోజనం కూడా ఉంటుంది. జ్యూస్ల్లో విటమిన్ ‘సి’ ఉంటుంది. విటమిన్ ‘సి’ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు చేయడానికి ప్రధానంగా వైరస్ క్రిములు కారణం. అంతేగానీ నిమ్మ, నారింజ, ద్రాక్ష జ్యూస్లు కాదు. జలుబు ఉన్నవాళ్ళు వీటిని తీసుకుంటే వీటిల్లోని విటమిన్ ‘సి’ శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింత పెంచి వైరస్ని నిరోధిస్తాయి. నిమ్మసోడాలు, నారింజ, నిమ్మ, ద్రాక్ష రసాలు జలుబుని కలిగిస్తాయనేది అపోహే తప్ప నిజం కాదు.