ప్రశ్న:-”నేను ఒక వేశ్యతో సెక్స్‌లో పాల్గొన్నాను. కేవలం 5-6 స్ట్రోక్స్ మాత్రమే ఇచ్చాను. వీర్యం యోనిలో కాకుండా బయటే వదిలేశాను. వీర్యం యోనిలో పడితేనే ఎయిడ్స్ వస్తుందని, కేవలం పురుషాంగం ప్రవేశంతో ఎయిడ్స్ రాదని మా స్నేహితుడు చెప్పాడు. అతని మాట ప్రకారం నేను వేశ్యతో శృంగారంలో పాల్గొన్నాను కనుక నాకు ఎయిడ్స్ రాదు కదా?”
జవాబు:- యోనిలో వీర్యం స్ఖలింపబడితేనే ఎయిడ్స్ వస్తుందని లేకపోతే రాదని అనుకోవడం అపోహ మాత్రమే. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వారిలో హెచ్.ఐ.వి. ఉన్నట్టయితే వీర్యం పడకపోయినప్పటికీ వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాధి సంక్రమణకి, వీర్యం పడటానికి సంబంధం లేదు. మీ విషయంలో డాక్టరుకి చూపించుకుని పరీక్ష చేయించుకోండి. వ్యాధి సంక్రమించిందీ లేనిదీ నిర్ధారణ చేసుకోండి. అంతేగాని అర్థంలేని ధీమాతో వ్యాధిని నిర్లక్ష్యం చేయకండి.