ప్రశ్న:-”నిమ్మరసం, నారింజరసం తాగితే జలుబు చేస్తుందా? పడిశం ఉన్నవాళ్ళు ద్రాక్షపళ్ళు తినకూడదా? ఐస్ నీళ్ళు తాగితే పడిశం మరింత ఎక్కువ అవుతుందా?”
జవాబు:- నిమ్మరసం, నారింజరసం వల్ల జలుబు రాదు. జలుబు చేసిన వాళ్ళు అంతకు ముందు వాటిని తాగకపోయినా, అప్పుడు తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. జలుబు చేయడానికి వైరస్ క్రిములు కారణం. వాతావరణం మార్పుతో వైరస్ క్రిములు విజృంభించి జలుబుని కలుగచేస్తాయి. నిమ్మ, నారింజల్లో విటమిన్ ‘సి’ ఉంటుంది. విటమిన్ ‘సి’ శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి వైరస్ని మరింత బలంగా ఎదుర్కొనే విధంగా తోడ్పడతాయి. పడిశం ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా ద్రాక్ష తినవచ్చు. ద్రాక్ష తినడం వల్ల జలుబు చేయడం లేదా జలుబు పెరగడం ఉండదు. పడిశం ఉన్నప్పుడు ఐస్నీళ్ళు తాగినా ఏమీ అవదు. కొందరికి పడిశం పట్టినప్పుడు గొంతునొప్పి వస్తుంది. గొంతులో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇటువంటివారు ఐస్ నీళ్ళు తాగినప్పుడు తాత్కాలికంగా గొంతులోని పల్చని కండరాలు స్పాజమ్కి లోనై కొద్దిగా బాధ కలిగించవచ్చు. అంతేతప్ప పడిశం బాధని పెంచడం ఉండదు.