ప్రశ్న:- ”పదహారు సంవత్సరాల వయస్సు నుంచి నాలో సెక్స్ కోరికలు విపరీతంగా ఉండేవి. ఎప్పుడూ ఆడదాని మర్మాయవాలు చూడాలనే తహతహ ఉండేది. అంతేకాకుండా వాటిని ముద్దెట్టుకోవాలని, చేతితో తాకాలని ఉండేది. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు. పెళ్ళై రెండు నెలలైంది. పెళ్ళైన తరువాత నా ముచ్చట తీర్చుకోవచ్చని ఎంతో ఆశపడ్డాను. మూడు నిద్రల సమయంలోనే నా కోరిక విపరీతమైపోయింది. ఆగలేక నా భార్యతో ఆమె మర్మావయవాలని చూడాలని ఉందని, ముద్దు పెట్టుకోవాలని ఉందని చెప్పాను. ఆమె చాలా సిగ్గుపడింది, సిగ్గే కదా అని ఒప్పుకోకపోయినా బలవంతంగా నా కోరిక తీర్చుకున్నాను. కోరిక తీరిందని ముచ్చటపడ్డాను గాని మరుసటి రోజు నామీద పడ్డ నింద పిడుగుకంటే పెద్దదనిపించింది. మా ఆవిడ నేను మామూలు మగవాడిని కాదని, పాయింట్ ఫైవ్గాడినని, నాతో కాపురం చేయనని నిక్కచ్చిగా చెప్పింది. పెళ్ళైన తర్వాత భార్య దగ్గర నా కోరిక తీర్చుకోవచ్చని ఇంతకాలం వేచి ఉన్న దాని పరిమాణం ఇది. భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె తల్లిదండ్రులు కూడా అందరితో సెక్స్‌లో నాది పెద్ద వింత ప్రవర్తనగా ముద్రవేశారు. నిజంగా నాది వింత ప్రవర్తనా?”
జవాబు:- కొందరికి కొన్ని రకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎదుటివాళ్ళ అంగీకారం అవసరం. ఎంత భార్య అయినప్పటికీ ఆమెకి ఇష్టం లేకుండా చేయడం చాలా తప్పు. మీ తొందరపాటు చర్య నష్టం తెచ్చి పెట్టింది. మర్మావయవాలని చూడాలనిపించడం, ముద్దాడటం, చూషించడం కొందరు దంపతుల విషయంలో సహజంగా ఉండే లక్షణమే. అదేమీ తప్పుకాదు. అయినప్పటికీ ఎదుటివాళ్ళ తోడ్పాటు లేకుండా బలవంతం చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఇప్పటికైనా మీకు జరిగిన దానికి పశ్చాత్తాపం ప్రకటిస్తూ శ్రీమతిని క్షమించమని కోరండి. మీలోని అపరిపక్వ మనస్తత్వం వల్ల బలవంతం చేయడం తప్పు అయిందని చెప్పండి. ఆమె అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి.