ప్రశ్న:- ”నాకు పెళ్ళై రెండు సంవత్సరాలైంది. దాదాపు రోజూ సెక్స్‌లో పాల్గొంటాను. మా ఆవిడ ఎటువంటి స్పందనలు లేకుండా పడుకుంటుంది. నా పని ముగించుకుని ఊరుకోవడం తప్ప ఆమె వైపు నుంచి ఎటువంటి ప్రేరణా ఉండదు. ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. సెక్స్‌కి ఎటువంటి అడ్డూ చెప్పదు కాని తృప్తి కలుగుతున్నదా లేదా అనేది నోరువిప్పి చెప్పదు. కొంతకాలంగా నేను తరచి తరచి అడగగా నా వల్ల తనకి ఎటువంటి సుఖం లేదని చెప్పేసింది. నేను కనీసం 10 నిమిషాలు సెక్స్ చేస్తాను. అయినా ఎందుకని తనకి తృప్తి అనిపించడం లేదు? పెళ్ళికి ముందు నేను విపరీతంగా హస్తప్రయోగం చేశాను. దానివల్ల నా అంగం ఉండవలసినంత గట్టిగా లేదనుకోవాలా? అలా ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా? నా భార్యని తృప్తిపరిచేందుకు ఏం చేయాలి?”
జవాబు:- మీ శ్రీమతిలో ఫ్రిజిడిటీ ఉంది. అందువల్లే ఆమెకు సెక్స్‌లో థ్రిల్ అనిపించడం లేదు. మీలో ఏ లోపమూ లేదు. హస్తప్రయోగం చేయడం వల్ల అంగం వీక్ అవడం అనేది ఉండదు. ఆమెకు సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకోథెరపి ద్వారా సెక్స్ ఎడల ఆసక్తి కలిగించవచ్చు. అలాగే సెక్స్‌లో తృప్తి కలిగేటట్టు చేయవచ్చు. మీలో ఏ ప్రాబ్లమ్ లేదు. నిర్భయంగా ఉండండి.