ప్రశ్న:- ”నేను వేశ్యతో ఒక్కసారే సెక్స్‌లో పాల్గొన్నాను. ఆ తరువాత 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి కూడా హెచ్.ఐ.వి. టెస్టులు చేయించుకున్నాను. టెస్టు రిపోర్టులో ఎయిడ్స్ లేదని వచ్చింది. నా స్నేహితుడు చెప్పిన ప్రకారం కొందరికి పది సంవత్సరాల వరకు టెస్టుల్లో బయటపడదట. ఇప్పటికి 3 సంవత్సరాలైంది. ఈ మూడు సంవత్సరాలు కనీసం 20 సార్లు ఎయిడ్స్ టెస్టు చేయించుకున్నాను. ప్రతి టెస్టులో ఎయిడ్స్ లేదనే వస్తోంది. నా స్నేహితుడు చెప్పినట్టు నా విషయంలో పది సంవత్సరాల వరకు బయటపడకపోవచ్చా? ఇంట్లో పెళ్ళి చేస్తామని గోలపెడుతున్నారు. కాని ఏదో ఒక వంక చెబుతూ పెళ్ళి తప్పించుకుంటూ వస్తున్నాను. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. చివరిగా మీ సలహా కోసం రాస్తున్నాను.”
జవాబు:- కొందరి రక్త పరీక్షల్లో 10 సంవత్సరాల వరకు ఎయిడ్స్ బయటపడదని మీ స్నేహితుడు చెప్పింది నిజం కాదు. ఎయిడ్స్ వ్యాధి క్రిములు సంక్రమిస్తే మూడు నెలల్లో తెలిసిపోతుంది. ఎక్కడో ఒకటి, రెండు కేసుల్లో ఆరు నెలలు పడుతుంది. అంతేతప్ప అయిదు సంవత్సరాలు, పది సంవత్సరాలు కాదు. మీలో ఎయిడ్స్ ఫోబియా చోటు చేసుకుంది. ఆ భయం మీ అజ్ఞానం వల్లనే. మీరు నిర్భయంగా పెళ్ళి చేసుకోండి. ఎయిడ్స్ గురించి మరిచిపోండి.