Friday, October 22, 2021
spot_img

ఒక మోడుగానే మిగిలిపోతానా?

ప్రశ్న:-   ”నాకు నాలుగు సంవత్సరాల క్రితం హిస్టరక్టమీ ఆపరేషన్‌ అయింది. బిడ్డ సంచి తీసేశారు. ఆపరేషన్‌ ముందు విపరీతంగా బ్లీడింగ్‌ అయ్యింది. నెలలో కనీసం 20 రోజులు బ్లీడింగ్‌ ఉండేది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. నాకు సెక్స్‌ కోరిక ఎక్కువగా ఉంటుంది. బ్లీడింగ్‌ అవుతున్నప్పటికీ సెక్స్‌ కావాలని అడిగేదాన్ని, కాని మా వారు చికాకు పడేవారు. ఒక్కోసారి నా బలవంతం మీద సెక్స్‌ చేసేవారు. చాలాకాలం ఆపరేషన్‌ అంటే భయం ఉండి చేయించుకోలేదు. చివరికి సెక్స్‌ కోసమే ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఆపరేషన్‌ తరువాత ఇంకో ప్రాబ్లమ్‌ వచ్చింది. యోని డ్రైగా ఉండి అంగప్రవేశం జరగడం లేదు. ఒకవేళ నూనె లేదా నెయ్యి రాసుకుని సెక్స్‌ చేసినప్పటికీ కొద్ది సేపటికే ఎండిపోయి యోని లోపల మంట అనిపిస్తోంది. దానికి తోడు మా వారికి ఎంతసేపైనా వీర్యం పడదు. దాంతో నాకు మరింత మంట అనిపిస్తుంది. ఇదివరకు సెక్స్‌ అంటే ఎంత ఆసక్తి ఉండేదో ఇప్పుడు అంత విరక్తి కలుగుతోంది. ఇక మా బతుకు ఇంతేనా? 45 సంవత్సరాలకే సెక్స్‌ సుఖం కోల్పోయినట్టేనా? నాకెంతో దిగులుగా ఉంది. నాకు మార్గం చూపించండి.” 

జవాబు:-     హిస్టరక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ మీలాంటి సమస్య ఎదురవదు. గర్భాశయంతో పాటు రెండు ఓవరీస్‌ తీసేయబడ్డ వాళ్ళల్లోనే ఈస్ట్రోజన్‌ తక్కువై యోని లోపల పొరలు పలచనై, ద్రవాలు తక్కువ ఊరటం ఉంటుంది. ఇటువంటి వాళ్ళల్లోనే యోని లోపల డ్రైనెస్‌ డెవలప్‌ అయి అంగప్రవేశం అంతగా కుదరదు. మంట అనిపిస్తుంది. మీరు డాక్టరుకి చూపించుకోండి. అవసరాన్ని బట్టి ఈస్ట్రోజన్‌ టాబ్లెట్లు లేదా యోని లోపల ఈస్ట్రోజన్‌ హార్మోను ఆయింట్‌మెంట్‌ వాడవలసి వస్తాయి. కొందరిలో కేవలం కె.వై.జెల్లీ రాస్తే అంగప్రవేశం తేలికగా జరుగుతుంది. సెక్స్‌లో ఎటువంటి బాధా ఉండదు. డాక్టరుతో మీ సమస్యని ఉన్నదున్నట్టు వివరంగా చెప్పండి. తప్పకుండా మీ దాంపత్య జీవితం ఆనందకరంగా మారుతుంది. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!