Friday, October 22, 2021
spot_img

వాళ్ల ఉచ్చులో పడకండి

ప్రశ్న:-   ”నా వయస్సు 22 సంవత్సరాలు. హైట్‌, వెయిట్‌, పర్సనాలిటీ బాగానే ఉన్నాయి. ఒక అమ్మాయి నా మీద మనస్సు పడింది. నేనంటే ఎంతో ఇష్టమని చెబుతుంది. కానీ తనంటే నాకూ ఇష్టమని ఇంతవరకూ చెప్పలేకపోయాను. ఎందుకంటే నా అంగం చాలా చిన్నది. సన్నగా, పొట్టిగా ఉంటుంది. అంగం ఇలా ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయితో సెక్స్‌లో పాల్గొంటే తృప్తి కలిగించగలనా? లేనా? అన్న డౌట్‌ ఉంది. అంతవరకు ఎందుకు, స్నేహితులతో స్విమ్మింగ్‌కి వెళ్ళినప్పుడు ఎక్కడ నా అంగం చిన్నదిగా ఉందని గమనిస్తారో అని భయపడి చస్తుంటాను. నా అంగం దొడ్డుగా, పొడవుగా అవ్వాలని ఎంతో కోరిక ఉంది. ఏవైనా ఆయిల్స్‌ మర్దన చేస్తే లావు అవుతుందా? ఇటీవల పేపర్లో ఎడ్వర్టయిజ్‌మెంట్లు వేసే ఒక సెక్స్‌ డాక్టరు దగ్గరికి వెళ్ళాను. అంగపరిమాణం పెరగడానికి కరెంటు పెడతానన్నాడు. పది వేలు ఫీజు అడిగాడు. అంత డబ్బు నా దగ్గర లేదు. మీరే నాకు మార్గం చూపించండి.” 

జవాబు:-     మీలో సెక్స్‌ కోరికలు, అంగస్థంభనలు మామూలుగా ఉంటే అంగపరిమాణం గురించి ఆలోచించడం అనవసరం. యుక్తవయస్సు వచ్చిన వారు నూటికి 90 మందికి పైగా హస్తప్రయోగం చేస్తారు. మీరు కూడా సెక్స్‌ కోరికతో హస్తప్రయోగం చేస్తూ ఉంటే ఇక సెక్స్‌ సామర్థ్యం గురించి, అంగం సైజు గురించి ఆలోచించవద్దు. అంగపరిమాణం పెంచడానికి కరెంటు వైద్యం అంటూ చెప్పేదంతా మోసపు మాటలే. బోగస్‌ డాక్టర్లే అటువంటి కబుర్లు చెప్పి మీలాంటి అమాయకులని దగా చేస్తారు. వాళ్ళ మాటల ఉచ్చులో పడకండి. నిర్భయంగా మీరంటే ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్ళి చేసుకోండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!