ప్రశ్న:- ”నా వయస్సు 22 సంవత్సరాలు. ఇంతవరకు గెడ్డాలు, మీసాలు రాలేదు. నా ఫ్రెండ్సుకి వచ్చాయి. వాళ్ళు నన్ను వెక్కిరిస్తున్నారు. చదువు మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాను. అంగస్తంభనలు బాగానే ఉన్నాయి. హస్తప్రయోగం చేస్తున్నాను. గెడ్డాలు, మీసాలు వస్తే మగతనం మరింత ఎక్కువగా ఉంటుందా, ఉండదా అనే విషయం నాకు తెలియదు. అయినా గెడ్డాలు, మీసాలు మగవానికి ఉండి తీరాలి కదా. నాకు గెడ్డాలు, మీసాలు వచ్చే మార్గం చెప్పండి.’
జవాబు:-గెడ్డాలు, మీసాలు లేనంత మాత్రాన మగతనం తక్కువ అని భావించకూడదు. కొందరికి జీన్స్ సరిగా ఉండక గెడ్డాలు, మీసాలు అంతగా రావు. మందులు వాడినంత మాత్రాన అవి పెరగవు. మీలో అంగస్థంభనలు మామూలుగా ఉన్నాయి. కనుక దిగులు చెందకండి. స్నేహితుల మాట పట్టించుకోకండి. చదువు మీద శ్రద్ధ పెట్టండి.