ప్రశ్న:- ”నాలుగు సంవత్సరాల క్రితం ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాను. కండోమ్ వాడలేదు. పుండు పడలేదు. చీము రాలేదు. నా దురదృష్టం ఏమిటో అప్పటి నుంచి అంగంలో చెప్పలేనంత మంట. పగలు – రాత్రి తేడా లేకుండా భగభగ మండిపోతుంది. ఈ నాలుగు సంవత్సరాల్లో కనీసం 20 సార్లు ఎయిడ్స్ టెస్టు చేయించుకున్నాను. వి.డి.ఆర్.ఎల్. రక్త పరీక్ష, మూత్రం పరీక్ష, బ్లడ్-యూరిన్ కల్చర్ టెస్టులు బోలెడుసార్లు చేయించుకున్నాను. ఎందులోనూ ఏమీ లేదు. డాక్టర్లు ఏ టెస్టుల్లోనూ ఏమీ లేవు. కనుక ఏ జబ్బూ లేదంటారు. నా గొడవ పడలేక ప్రతీ డాక్టరు ఖరీదైన మందులు రాసి ఇస్తున్నారు. అయినా మంట తగ్గడం లేదు. చచ్చిపోవాలని ఉంది. నాకు తెలియకుండా ఏదైనా భయంకరమైన సుఖవ్యాధి చోటు చేసుకుందా?”
జవాబు:- మీలో వి.డి.ఫోబియా లేదా ఎయిడ్స్ ఫోబియా చోటు చేసుకుంది. వేశ్యతో కలిశారు కనుక తప్పకుండా వ్యాధి వచ్చి ఉండాలని అనుకుంటున్నారు. వేశ్యతో కలిసిన ప్రతి ఒక్కరికీ వ్యాధి రావాలని లేదు. ఏ వ్యాధి లేని వేశ్యలు కూడా ఉంటారు. మీకు అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నాయి కనుక జరిగిన విషయాన్ని మరిచిపోండి. మీకు ఉన్న మంట కేవలం భయం వల్ల పుట్టుకు వచ్చిందే. మీకు సైకోథెరపీ వల్ల రిలీఫ్ వస్తుంది. సైకోథెరపీ చేయించుకోండి.