ప్రశ్న:- ”నాకు ఇంకా పెళ్ళికాలేదు. సెక్స్ కోరిక ఎక్కువ ఉండటం వల్ల వేశ్యల దగ్గరికి వెళ్ళాను. నిరోధ్ మీద నిరోధ్ తొడిగాను. సెక్స్ సమయంలో జారడం గాని, చిరగడం గాని జరగలేదు. అయినా మరునాటికి నా పురుషాంగం ఎర్రగా తయారైంది. దురద, మంట అనిపించాయి. నా దగ్గర స్కిన్ ఆయింట్మెంట్ ఉంటే రాశాను. 1-2 రోజుల్లో బాధ తగ్గిపోయింది. వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వేశ్య దగ్గరికి వెళ్ళాను. ఈసారి నిరోధ్ లేదు. నేరుగా సెక్స్‌లో పాల్గొన్నాను. ఇంతవరకూ ఏ బాధా లేదు. మొదటిసారి డబుల్ నిరోధ్ వేసుకున్నా ఎందుకని వ్యాధి వచ్చింది? ఆ వేశ్య దగ్గర పవర్ఫుల్ జబ్బులు ఉన్నట్టా? నేను ఆ అమ్మాయిని గాఢంగా ముద్దులు పెట్టుకున్నాను కూడా. ఆమె దగ్గిర భయంకరమైన జబ్బులు ఉండి ముద్దుల ద్వారా సంక్రమించి ఉంటాయా? చాలా భయంగా ఉంది. మీ సమాధానంతో నన్ను రక్షించండి.”
జవాబు:- కొందరిలో నిరోధ్లో ఉండే నూనెలాంటి పదార్థం ఎలర్జీ కలిగిస్తుంది. నిరోధ్కి అటువంటి లూబ్రికెంట్ పదార్థం లేకపోతే పురుషాంగానికి తొడగడం కుదరదు. అది మీకు డెర్మటైటిస్ కలిగించింది. మీ దగ్గర ఉన్న స్కిన్ ఆయింట్మెంట్ కార్టిజోన్ ఆయింట్మెంట్ కావచ్చు. అందువల్ల ఆ దురద, మంట వెంటనే తొలగిపోయాయి. రెండవ వేశ్య దగ్గర నిరోధ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ ఏ వ్యాధీ రాకపోవడానికి ఆమె దగ్గర వ్యాధులు లేకపోవచ్చు. అందరి వేశ్యల దగ్గర తప్పకుండా వ్యాధులు ఉండాలని లేదు. అదీకాకుండా వాళ్ళు కూడా వ్యాధులకి మందులు వాడుతూ ఉంటారు కనుక ఆ మందులు వాడిన సమయంలో వ్యాధుల తీవ్రత లేకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ లైంగిక సంబంధాలు క్షేమకరం కాదు.