ప్రశ్న:- ”నేను 20 ఏళ్ళ అమ్మాయిని, ఇంకా పెళ్ళి కాలేదు. సెక్స్పరమైన కోరికలు నన్ను కుదిపేస్తూ ఉంటాయి. టెన్త్క్లాస్లో చదువు ఆపేయడం జరిగింది. వేరే వ్యాపకం ఇంకేమీ లేకపోవడంతో సెక్స్ కోరికలు మరీ ఎక్కువ కలుగుతున్నాయి. మాది అంతగా ఆర్థిక స్థోమత లేని కుటుంబం. అబ్బాయి తాలూకు వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేక పెళ్ళి సంబంధం కుదరడం లేదు. ఇటీవల సెక్స్ కోరిక కలిగినప్పుడు యోని దగ్గర ద్రవాలు ఎక్కువ ఊరుతున్నాయి. లోపలి దుస్తులు తడిసిపోతున్నాయి. గర్భాశయం కేన్సర్ ఉన్న వాళ్ళకి తెలుపు ఎక్కువ అవుతుందని ఆ మధ్య ఏదో పేపర్లో చదివాను. అప్పటి నుంచి చాలా భయం వేస్తోంది. రెండు పదులు నిండకుండానే, సెక్స్ సుఖాన్ని పొందకుండానే నాకు వందేళ్ళు నిండిపోతున్నాయా? నాకు చాలా భయంగా ఉంది. మీరే నాకు మార్గం చూపించాలి.
జవాబు:- సెక్స్పరమైన స్పందనలు కలిగినప్పుడు స్త్రీలలో యోని దగ్గర ద్రవాలు స్రవిస్తాయి. కొందరిలో ఈ ద్రవాలు కొద్దిగానే స్రవిస్తే, మరికొందరిలో అధికంగా స్రవిస్తాయి. అదేమీ జబ్బుకాదు. ఆరోగ్యకరమైన లక్షణమే. కేన్సరు వ్యాధిలో కూడా ద్రవాలు ఎక్కువ ఊరుతాయి. కాని ఆ ద్రవాలు కాస్త ఎర్రజీరతో ఉంటాయి. వాసన వేస్తాయి. ఇంత చిన్న వయస్సులో కేన్సరు రాదు. అందుకని మీరు కేన్సరు గురించి భయపడకండి. త్వరలోనే మీకు పెళఇ్ళ కుదరవచ్చు. జీవితాన్ని తప్పక ఎంజాయ్ చేస్తారు.