ప్రశ్న:-”మా మెస్‌లో వంటవానికి హెచ్.ఐ.వి. ఉందని మొన్ననే తెలిసింది. ఇంతకు ముందు అతనికి కత్తిపీట తెగి రెండు, మూడుసార్లు చేతికి గాయం కూడా అయింది. బహుశా అతని రక్తం కూరగాయల్లో కలిసి ఉంటుంది. అతని రక్తం కలిసిన కూరలు తినడం వల్ల మాకు కూడా హెచ్.ఐ.వి. వచ్చి ఉంటుందా? మాకు చాలా భయంగా ఉంది.”
జవాబు:- హెచ్.ఐ.వి. రోగి రక్తం కలిసిన కూరలు తినడం వల్ల హెచ్.ఐ.వి. రాదు. రక్తం బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే హెచ్.ఐ.వి. వైరస్ చనిపోతాయి. తినే పదార్థాలు, తాగే పదార్థాలు ద్వారా హెచ్.ఐ.వి. రానే రాదు. కనుక మీకు భయం అవసరం లేదు.