Saturday, October 16, 2021
spot_img

ఎక్కడ నుంచి వస్తుంది?

ప్రశ్న:-   ”నేను రోజూ స్నానం చేసేటప్పుడు పురుషాంగం పూర్వచర్మాన్ని పూర్తిగా వెనక్కిలాగి క్లీన్‌ చేసుకుంటాను. ఒకవేళ 1-2 రోజులు అలా చేయకపోతే పురుషాంగం పూర్వ చర్మం క్రింద పాచిలాగా తయారవుతుంది. నేను ఎంతో శుభ్రంగా ఉంటాను. అయినా ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చి చేరుతుంది?” 

జవాబు:-     పురుషాంగం పూర్వ చర్మం క్రింద తయారయ్యే పాచిని స్పెగ్నా అంటారు. ఇది జున్నులాగా జిడ్డుగా ఉంటుంది. పురుషాంగం పూర్వచర్మం క్రింద ఉండే ఆయిల్‌ గ్లాండ్స్‌ నుండి కొంత తయారు కాగా చర్మం నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు కూడా దానికి తోడు అవుతాయి. ఇలా స్పెగ్నా తయారవుతుంది. పురుషాంగం పూర్వచర్మం క్రింద తయారయ్యే ఈ పాచి పదార్థాన్ని రెండు పూటలా స్నానం చేసేటప్పుడు సబ్బుతో రుద్ది క్లీన్‌ చేసుకోవాలి. పాచిని శుభ్రం చేసుకోకపోతే అందులో బాక్టీరియా క్రిములు చేరి పుండుగా మారుస్తాయి. సున్తీ చేయించుకున్న వాళ్ళలో పాచి చేరడం ఉండదు. పురుషాంగం పూర్వచర్మం ఉండదు కనుక అక్కడ తయారయ్యే కాస్తో కూస్తో పాచి బట్టలకు రుద్దుకుపోయి ఎప్పటికప్పుడు క్లీన్‌ అవుతుంది.

spot_img

Must Read

Previous articleFrom Where It Is Coming?
Next articleBurning Is Foolish

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!