ప్రశ్న:-”నేను 4 సంవత్సరాల క్రితం ఒకామెతో సెక్స్‌లో పాల్గొన్నాను. మరుసటి రోజుకు పురుషాంగం చివరి చర్మం బ్లేడ్‌తో కోసినట్లయింది 2-3 చోట్ల. ఏవో మందులు వాడితే తగ్గిపోయింది. ఆ తర్వాత నా భార్యతో కలిస్తే కూడా అప్పుడప్పుడు ఇలాగే జరుగుతోంది. పరాయి స్త్రీతో వచ్చిన జబ్బు నన్ను వెంటాడుతోందా? లేదా పరాయి స్త్రీ యోని చాలా టైట్‌గా ఉండి నా చర్మం చిట్లిపోయిందా? నాకు భయంగా ఉంది. ఏం చేయాలి?”
జవాబు:- కొందరికి షుగరు ఉంటే పురుషాంగం పూర్వచర్మం కాస్త టైట్‌గా మారుతుంది. ఇంకొందరికి షుగరు లేకపోయినప్పటికీ చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. దాంతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు చర్మం చిట్లుతుంది. మీకు పరాయి స్త్రీతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మొదటిసారి బయటపడి ఉంటుంది. డాక్టరు చేత షుగరు పరీక్ష, ఇతర పరీక్షలు చేయించుకోండి. చర్మం ఇలా చిట్లడం, పుండు పడటం ఉంటే సున్తీ చేయించుకోవడం ఒక్కటే మార్గం