ప్రశ్న:- ”నా వయస్సు 21 సంవత్సరాలు. ఇంకా పెళ్ళి కాలేదు. ఇటీవల ఒకమ్మాయితో సెక్స్‌లో పాల్గొన్నాను. అర నిమిషంలోనే వీర్యం పడిపోయింది. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ అమ్మాయితో కలిశాను. ఈసారి కూడా వెంటనే పడిపోయింది. ఆ అమ్మాయి నన్ను చీదరించుకుంది. నా వల్ల తనకి ఎటువంటి తృప్తి కలగలేదంది. చిరాకు పుట్టిందని చెప్పింది. నేను పెళ్ళికి పనికిరానా? పెళ్ళైన తర్వాత భార్య కూడా ఇలాగే చీదరించుకుంటే నేను ఏమైపోవాలి? నేను పెళ్ళిచేసుకోనా? వద్దా? నాలో సెక్స్ కోరికలు తీవ్రంగానే ఉన్నాయి. కానీ ఏం లాభం? ఆడదానికి తృప్తి ఇవ్వలేకపోతున్నాను. నా బ్రతుక్కి మార్గం చూపించండి.”
జవాబు:- వయస్సులో ఉన్నప్పుడు సెక్స్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందులోనూ సెక్స్ కోసం ఆరాటంతో అమ్మాయితో కలిసినప్పుడు ఆ ఆరాటమే త్వరగా వీర్యం పడిపోవడానికి కారణమవుతుంది. అంతేతప్ప అదేమీ సెక్స్ బలహీనత కాదు. మీరు పెళ్ళి చేసుకున్న తరువాత రోజూ సెక్స్‌లో పాల్గొంటూ ఉంటే శీఘ్ర స్ఖలనం సమస్య అంతగా ఉండదు. పెళ్ళైన తరువాత కూడా శీఘ్ర స్ఖలనం సమస్య వెంటాడుతూ ఉంటే ఫ్లూ ఆక్సిటన్ 20 ఎం.జి. కాప్సూల్స్ ఉదయం-1, మధ్యాహ్నం-1 చొప్పున 3 నెలలు వాడితే చాలావరకు సమస్య తీరుతుంది. మీరు నిర్భయంగా ఉండండి.