Saturday, October 16, 2021
spot_img

సెక్సు లేకుంటే గుండెజబ్బు తప్పదా?

ప్రశ్న:-   ”నా వయస్సు 68 సంవత్సరాలు. గత 10 సంవత్సరాలుగా సెక్స్‌ లేదు. మా ఆవిడకి సెక్స్‌లో ఇంట్రస్టు పూర్తిగా తగ్గిపోవడంతో నేను కూడా దాని గురించి ఆలోచించడం మానేశాను. ఇటీవల ఒక దినపత్రికలో వచ్చిన వార్త చూసిన దగ్గర నుంచి నాకు ఒక భయం పట్టుకుంది. ఆ వార్తలో రోజూ సెక్స్‌లో పాల్గొనని వాళ్ళు గుండె జబ్బుకి గురయ్యే ప్రమాదం ఉందని రాశారు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సెక్స్‌ లేకపోవడం వల్ల గుండె జబ్బు తెచ్చుకోవడం నాకు అంతగా మనస్కరించడం లేదు. మా ఆవిడలో సెక్స్‌ ఎడల ఆసక్తి పెరిగేటట్టు, నాకు సెక్స్‌ సామర్థ్యం వచ్చేట్టు తగిన సలహా ఇవ్వగలరు. 

జవాబు:-     మీరు చూసిన వార్త ఏ సందర్భానికి చెందినదో తెలియదుగాని సెక్స్‌ పరమైన కోరికలు ఉండి, వాటిని బలవంతంగా అణిచివేస్తే మానసిక వత్తిడి కలిగి ఆ ఒత్తిడి గుండెమీద కనబడుతుంది. ముఖ్యంగా ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్ళల్లో ఇటువంటి దుష్ప్రభావం కనబడే అవకాశం ఉంది. అయితే చాలామంది గుండెపోటు వచ్చిన వాళ్ళు సెక్స్‌ గురించి ఆలోచించడం మానేస్తారు. ఇతర విషయాల మీద మనస్సుని లగ్నం చేస్తారు. దానివల్ల మానసిక వత్తిడి పెరిగే అవకాశం ఉండదు. మీరు కూడా అలాగే మనస్సుని పూర్తిగా ఇతర విషయాల మీదకి మళ్ళించుకున్నారు. మీలో సెక్స్‌ లేదనే ఆలోచనే లేదు. అందుకని మీలో మానసిక వత్తిడి పెరగడం, గుండెను దెబ్బతీయడం ఉండదు. అందుకని మీ జీవనశైలిని ఇప్పుడున్న విధంగానే కొనసాగించండి. అనవసరంగా మీ ఆవిడతో గొడవ పడకండి. ప్రశాంతంగా ఉన్న మీ సంసార జీవితంలో అర్ధంలేని ఇబ్బందులని ఆహ్వానించకండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!