ప్రశ్న:- ”బుద్ధి తక్కువై తొందరపాటుతో ఒకాయనతో సెక్స్‌లో పాల్గొన్నాను. చాలా తృప్తి అనిపించింది. స్వర్గం చూపించాడనిపించింది. మళ్ళీ మళ్ళీ ఆయనతో సెక్స్‌లో పాల్గొనాలనిపించింది. కాని ఆయనతో సెక్స్‌లో పాల్గొన్న వారం పది రోజులకి తెలుపు ఎక్కువ అవడం, మర్మావయాల దగ్గర దురద అనిపించడం, మూత్రం మంట అనిపించడం జరిగాయి. లేడీ డాక్టరు దగ్గరికి వెళ్ళాను కానీ జరిగిన విషయం ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయాను. ముందు వేడి చేసిందని అవీ ఇవీ తీసుకున్నాను. కాని బాధ తగ్గలేదు. ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది. ఇది జరిగిన తరువాత భర్తతో కూడా కలిశాను. మరి ఆయనకూ ఈ బాధలు వచ్చాయేమో నాకు తెలియదు. ఇప్పుడు నా మనసంతా గందరగోళంగా ఉంది. ఏం చేయాలో, ఏమవుతుందో అన్న భయం నన్ను వణికిస్తోంది. నిద్రపట్టడం లేదు. తిండి కూడా సక్రమంగా తినలేకపోతున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పని చేయను. నా బాధ అర్థం చేసుకుని ఈ భయానక పరిస్థితి నుంచి నన్ను బయట పడేయండి.”
జవాబు:- అపరిచిత వ్యక్తితో లైంగిక సంబంధం వల్ల మీకు గనేరియా గాని, ట్రైకో మొనియాసిస్గాని వచ్చి ఉంటాయి. ఎజిథ్రోమైసిన్ 500 మి.గ్రా. బిళ్ళలు రెండు, టినిడజోల్ 1000 మి.గ్రా. బిళ్ళ ఒకటి, ఫ్లూకనజోల్ 150 ఎం.జి. బిళ్ళ ఒకటి వేసుకోండి. సెఫిక్సిమ్ 200 బిళ్ళలు రెండు వేసుకోండి. చాలావరకు మీ బాధలు తొలగిపోతాయి. మీ వారి చేత కూడా ఇవే మందులు వాడించండి. ఇద్దరూ ఒకేసారి వాడటం అవసరం. ఇంకా బాధలు మిగిలి ఉంటే డాక్టరుని సంప్రదించండి. ఇక ముందెప్పుడూ తొందర పడకండి.