Saturday, October 16, 2021
spot_img

బొద్దుగా ఉంటే రక్తం దండిగా ఉన్నట్టు కాదు

ప్రశ్న:-   ”నేను ఎర్రగా, బొద్దుగా ఉంటాను. కాని నీరసంగా ఉంటాను. ఏ పని చేయాలన్నా అలసిపోతాను. కొంత దూరం నడవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా ఆయాసం అనిపిస్తుంది. గాని అందని ఫీలింగ్‌ ఉంటుంది. గుండె జబ్బు కావచ్చునని డాక్టర్‌కి చూపించుకున్నాను. డాక్టరు ఇసిజి, రక్త పరీక్షలు చేసి గుండె చక్కగా ఉందని, రక్తమే చాలా తక్కువగా ఉందని అన్నారు. రక్తం పట్టడానికి మందులు రాసిచ్చారు. ఈ విషయం మా స్నేహితురాలితో చెబితే ఇంత లావుగా ఉన్న నీకు రక్తం లేకపోవడం ఏమిటి అని హేళన చేసింది. లావుగా ఉన్న వాళ్ళకి రక్తం ఫుల్‌గానే ఉంటుందా? సన్నగా ఉన్నవాళ్ళకి రక్తం తక్కువగా ఉంటుందా? నాకు రక్తం తక్కువ ఉన్నదని డాక్టర్‌ చెప్పింది నిజమా? అబద్ధమా?”

జవాబు:-     లావుగా ఉండటానికి, రక్తం ఉండటానికి సంబంధం లేదు. ఎంత లావుగా ఉన్నా, ఎరగ్రా, బుర్రగా ఉన్నా రక్తం లేకపోవచ్చు. ఒంటికి కొవ్వు చేరడం వల్ల లావు అవుతారు. రక్తం లేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆహారంలో ఐరన్‌ ఉండే ఆకు కూరలు, ఇతర పదార్థాలు సరిగా తీసుకోకపోవడం, కడుపులో పాములు ఉండటం, రక్తం తయారీలో లోపం ఏర్పడటం, ఓవర్‌ బ్లీడింగ్‌, మొలలు, రక్తహీనతకు కారణాలు. లావుగా ఉన్నంత మాత్రాన రక్తం పట్టడానికి అవసరమైనవి తీసుకుంటునాన్రి అనుకోనవసరం లేదు. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు అధికంగా తింటే ఒంటికి కొవ్వు చేరి లావుగా తయారవుతారే తప్ప రక్తం పట్టదు. మీ విషయంలో అదే జరిగింది. రక్తహీనత ఉన్నప్పుడు నీరసం, అలసట, ఆయాసం, ఛాతిలో నొప్పి, గుండె బరువు వంటి లక్షణాలు కలుగుతాయి. మీ స్నేహితురాలి మాటలు పట్టించుకోకుండా డాక్టరు చెప్పినట్లు మందులు వాడండి. చక్కగా రక్తం పట్టి ఆరోగ్యంగా తయారవుతారు.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!