ప్రశ్న:-”నా పురుషాంగం మీద చిన్న చిన్న నీటి పొక్కులు తేలుతున్నాయి. నేనొక ఆంటీతో కలిసిన తర్వాతే ఇలా జరిగింది. నేను హెచ్.ఐ.వి. టెస్టు, హెర్పిస్ సింప్లెక్స్ టెస్టు చేయించుకున్నాను. హెచ్.ఐ.వి. లేదని, హెర్పిస్ సింప్లెక్స్ ఉందని రిపోర్టులో వచ్చింది. నేనొక డాక్టరుకి చూపించుకున్నాను. అతను సుఖవ్యాధులకి చికిత్స చేస్తాడు. హెచ్.ఐ.వి. ప్రస్తుతం తెలియకపోయినప్పటికీ 10 సంవత్సరాలు తర్వాత బయటపడుతుందని అన్నాడు. హెర్పిస్ సింప్లెక్స్ హెచ్.ఐ.వి.గా మారుతుంధన్నాడు. అది విన్న దగ్గర నుంచి నాకు చాలా భయంగా ఉంది. హెర్పిస్ సింప్లెక్స్ హెచ్.ఐ.వి.గా మారడం ఖాయమా?”
జవాబు:-హెర్పిస్ సింప్లెక్స్ వేరు, హెచ్.ఐ.వి. వేరు. హెర్పిస్ సింప్లెక్స్ హెచ్.ఐ.వి.గా మారదు. అందుకని మీకు ఆ భయం అవసరం లేదు. హెచ్.ఐ.వి. వచ్చిన వాళ్ళల్లో రోగనిరోధక శక్తి తగ్గి కొన్ని వ్యాధులు కలుగుతాయి. అలా కలిగే వ్యాధుల్లో హెర్పిస్ సింప్లెక్స్ ఒకటి. అంతే తప్ప హెర్పిస్ సింప్లెక్స్ వల్ల హెచ్.ఐ.వి. రావడం కాదు. మీరేమీ భయపడనవసరం లేదు. హెర్పిస్ సింప్లెక్స్ ఏమీ ప్రమాదం చేయదు. సరైన డాక్టరుకి చూపించుకుని ఏ సైక్లోవిరాన్ బిళ్ళలు కోర్సుగా వాడండి. చాలా వరకు రిలీఫ్ వస్తుంది.